Premature White Hair Problem: జుట్టును బలంగా, ఒత్తుగా చేసుకోవడానికి చాలా మంది వివిధ రకాల అయిల్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే వాటికి బదులుగా మస్టర్డ్ ఆయిల్‌ని వినియోగించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును రూట్ నుంచి బలంగా చేయడమేకాకుండా  సంరక్షించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జుట్టు ఆకృతి కూడా మారుతుంది. తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆయిల్‌ను వినియోగించాల్సి ఉంటుంది.ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ ఆయిల్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆయిల్‌ను వినియోగించడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆవ నూనె వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు:
ఆవ నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఈ ఆయిల్‌లో అనేక పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. దీంతో సులభంగా జుల్లు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.  ముఖ్యంగా హానికరమైన బ్యాక్టీరియా, చుండ్రు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


1. మస్టర్డ్ ఆయిల్ జుట్టు రాలడాన్ని ఆపుతుంది:
మస్టర్డ్ ఆయిల్ జుట్టు రాలే సమస్యను దూరం చేస్తుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఆయిల్‌తో తలకు మసాజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు చిట్లకుండా చేస్తుంది. అంతేకాకుండా రూట్‌ నుంచి జుట్టు బలంగా మారుతుంది.


2. జుట్టు చీలిపోవడం వంటి సమస్యలకు చెక్‌:
ఆవనూనె రాసుకోవడం వల్ల జుట్టు చివర్ల చీలిపోవడం వంటి సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలోని విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ , జింక్ లభిస్తుంది. దీంతో జుట్టు దృఢంగా తయారవుతుంది.


3. హెయిర్ కండిషనింగ్ కోసం:
మస్టర్డ్ ఆయిల్ జుట్టును కండిషనింగ్ చేయడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే ఆల్ఫా ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు తేమను అందిస్తాయి. ఇది మీ జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. దీంతో జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.


4.శిరోజాలను శుభ్రపరుస్తుంది:
ఆవాల నూనె మురికి  జుట్టును శుభ్రంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు స్కాల్ప్‌లోని మురికిని తొలగిస్తాయి. దీని వల్ల మీకు అలెర్జీ లేదా ఇన్ఫెక్షన్ సమస్యలు దూరమై చుండ్రు రాకుండా సహాయపడుతుంది.'


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFaceboo