Herbal Hair Oil For Long Hair: హెయిర్ ఫాల్ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. జుట్టును పొడుగ్గా వాలు జడలా చూసుకోవాలని ఎంతోమంది కాలా అయితే ముఖ్యంగా దీనికి మహిళలు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో ఉన్న ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తారు. అయితే వీటితో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. మనం సులభంగా ఇంట్లో కూడా హెర్బల్ ఆయిల్ తయారు చేసుకొని జుట్టుకు పెట్టుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మందంగా పెరుగుతుంది. ఇలా ఇంట్లో తయారు చేసుకున్న నేచురల్ రెమెడీస్ తో హెయిర్ ఆయిల్ తయారు చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మంచి పోషణ అందించడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈరోజు మనం సింపుల్ గా ఇంట్లోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకునే హెర్బల్ ఆయిల్స్ వల్ల ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి జుట్టుకు కావాల్సిన పోషణ అందిస్తాయి.


హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాల్సిన పదార్థాలు..
కొబ్బరి నూనె 200 ml
ఆముదం 50 ml
ఆలివ్ ఆయిల్ 50 ml
మెంతులు-2టేబుల్ స్పూన్లు
 కరివేపాకు ఒక గుప్పెడు
 ఉసిరిపొడి -2టేబుల్ స్పూన్లు
 మందార పూలు-6
 బృంగరాజ్ -2 టేబుల్ స్పూన్లు
 వేప ఆకులు ఒక గుప్పెడు
 రోజు మేరీ ఆయిల్-10 చుక్కలు
 లావెండర్-10 చుక్కలు


ఇదీ చదవండి: భారీ వర్షాలు రెడ్‌ అలెర్ట్‌.. అన్నీ స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటన..


హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారీ విధానం..
ఒక గిన్నె తీసుకొని అది శుభ్రంగా తుడుచుకోవాలి ఇందులో కొబ్బరి నూనె ఆముదం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఇది మనం హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి బేస్ ఉత్పత్తులు మన జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి.


ఇందులో మెంతులను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఆ ఆయిల్ లోకి ఈ మెంతులు వేయడం వల్ల మన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. అలాగే బాగా శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకు వేపాకు ఆరబెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఈ రెండు ఉపయోగించడం వల్ల జుట్టులో పేర్కొన్న డాండ్రఫ్ ఒకటి వేళ్ళతో తొలగిస్తుంది.


ఇప్పుడు ఉసిరి పొడి, బృంగరాజు పొడి కూడా ఈ నూనెలో వేసి బాగా కలపాలి ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లో కూడా ఉంటాయి దీని వల్ల జుట్టు పెరుగుతుంది హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడే వారికి ఉసిరి ఎంతో ఎఫెక్ట్ అంటారు. జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది జుట్టు రాలటాన్ని  నివారిస్తుంది.


ఇదీ చదవండి: రైతులకు దీపావళికి ముందే కేంద్రం భారీ‌ గిఫ్ట్‌.. ఖాతాల్లో రూ.2000 జమా! వెంటనే ఇలా చెక్‌ చేసుకోవచ్చు..


ఇక ఇందులో మనం మిక్స్ చేసుకునే మందార పువ్వులు కూడా జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. మన జుట్టుకు అదనపు మెరుపుని అందించి హెయిర్ ఫాల్ సమస్య రాకుండా నివారిస్తుంది.
ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపి ఒక సాస్ పాన్ లో వేసుకొని తక్కువ మంటపై పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. ఓ 20 నిమిషాలు అలాగే మరిగిన తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలి. మంట ఏమాత్రం పెద్దగా చేసిన పోషకాలు నశించిపోతాయి.


 నూనె చల్లారిన తర్వాత చీజ్‌ క్లోత్ సహాయంతో వడ కట్టుకోవాలి. పొడిగా ఉన్న బాటిల్ లో వేసి పెట్టుకుని అందులో రోజ్మెరీ ఆయిల్, లావెండర్ ఆయిల్ కూడా కలపాలి. వీటివల్ల నూనెకు మంచి సువాసన అందించడమే కాదా జుట్టు పెరుగుదల, రిలాక్సేషన్ కూడా అందిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.