Red Alert School Holidays: భారత వాతావరణ శాఖ భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు కూడా ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
అయితే, ముంబైలోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం నాటికి వర్షాలు ఆగాయి కానీ, ఆకాశం మేఘావృతమైంది. దీంతో కొన్ని లోకల్ ట్రైన్లు కూడా నిలిపివవేశారు. ముంబైకి లోకల్ ట్రైన్ లైఫ్‌లైన్ భారత వాతావరణ శాఖ ఇప్పటికే ముంబైలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసింది ముఖ్యంగా థానే, పాల్ఘర్, రాయగఢ్‌లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో బీఎంసీ అన్నీ స్కూళ్లు కాలేజీలకు ఈరోజు కూడా సెలవు ప్రకటించాయి. ముఖ్యంగా థానే, పాల్ఘర్, పూనే, పింప్రీ చించ్వాడ్ ప్రాంతాల్లో కూడా భారీవర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు.
అంతేకాదు ముంబై వాతావరణ శాఖ అధికారులు అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇంట్లో నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు. ఇక వాహనదారులు కూడా జాగ్రత్తగా వాహనాలు నడపాలని అవసరమైతే తప్ప బయటకు రాకూడదని బీఎంసీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో గురువారం సోనాపూర్, బందూప్లోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఎందుకంటే కేవలం 5 గంటల వ్యవధిలో 100 మిమి వర్షపాతం నమోదైంది
ఖైరానీ రోడ్డు, ఘట్కోపర్- అంధేరీ, ఎల్బీఎస్ మార్గ్ మరిన్ని రోడ్లన్నీ జలమయమయ్యాయి. అంతేకాదు ఆ ప్రాంతంలో ఉండేవారు వరదలకు నీరంతా ఇంట్లోకి చేరడంతో వస్తువులు కూడా డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. కుర్లా, థానే స్టేషన్లలోని రైళ్లను నిలిపివేయడంతో ఎక్కవ మంది ఛత్రపతి శివాజీ టెర్మినల్‌కు ప్రయాణీకులు పోటెత్తారు.