Radish Side Effects: భారత్లో శీతాకాలం ప్రారంభం కావడం వల్ల మార్కెట్లో విచ్చలవిడిగా ఆకుకూరలు దుంపలు లభిస్తూ ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేవి. ప్రస్తుతం మార్కెట్లో లభించే కూరగాయల్లో ముల్లంగి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ముల్లంగిలో ఆరోగ్యానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి ప్రజలంతా తరచుగా వీటిని తీసుకునేందుకు ఇష్టపడతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. శీతాకాలంలో ముల్లంగిని అతిగా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని సలాడ్స్ లో అతిగా తీసుకోవడం వల్ల పొట్టలోని చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ముల్లంగిని సలాడ్స్ లో తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


ముల్లంగి నీ ఇలా తింటున్నారా..?:


ప్రస్తుతం చాలామంది ముల్లంగిని సలాడ్స్ లో అతిగా వినియోగిస్తున్నారు. అయితే అదే సలాడ్స్ లో దోసకాయను కలిపి తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల చర్మ సమస్యలే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


ప్రతి ఒక్కరు సలాడ్స్ లో అతిగా కూరగాయలను వినియోగిస్తూ ఉంటారు. అందులో భాగంగానే కాకర, ముల్లంగిని మిక్స్ చేసి తింటున్నారు. దీనివల్ల కూడా శరీరానికి హానికరమైన వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి ముఖ్యంగా గుండె పోటు, గుండె సంబంధిత ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


తరచుగా పాలలో ముల్లంగిని వినియోగించి చాలా రకాల ఆహార పదార్థాలను తయారుచేస్తారు. ఇలా చేసినవి తినడం వల్ల చర్మంపై తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు జీర్ణక్రియ సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


సలాడ్స్ లో అతిగా నారింజ ముల్లంగిని వినియోగిస్తున్నారని ఇటీవల పలు అధ్యయనాలలో తేలింది. అయితే ఇలా వినియోగించడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా మిక్స్ చేసిన సలాడ్ ను తినడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారవచ్చు.


Also Read : Ram Charan Video Call : గుడ్ న్యూస్ చెప్పబోతోన్న ప్రభాస్!.. లీక్ చేసిన రామ్ చరణ్‌


Also Read : Anasuya Bharadwaj White Dress : బొడ్డు చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. తెలుపు దుస్తుల్లో అనసూయ అందాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook