Ragi Laddu Benefits: రాగులు ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది ప్రతిరోజు తీసుకోవడం వల్ల అధిక బరువు, ఎముకల ధృండగా, అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి  బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగులుతో వివిధ రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. రాగి సంగటి, జావ, రాగి రొట్టె చేసుకోవచ్చు. అయితే ఇవే కాకుండా రుచిగా తినాలి అనుకోనేవారు  రాగి ల‌డ్డునూ కూడా త‌యారు చేసుకోవ‌చ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

✤  రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి:


ముందుగా ఒక కప్పు, రాగిపిండిని తీసుకోవాలి, ఒక కప్పు పల్లీలు, రెండు టేబుల్‌ స్పూన్స్‌ బాదం పప్పు, ఒక కప్పు  బెల్లం పొడి, అర టీ స్పూన్‌ యాలకుల పొడి తీసుకోవాలి.  తర్వత రాగిపిండిని గిన్నెలోకి తీసుకోని దానికి సరిపడిన నీళ్లు పోసుకోవాలి. దీని రొట్టెలాగా వత్తుకోవాలి.  స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేసుకోవాలి. వేడ‌య్యాక పెనంపై నూనె వేసుకోని దీనిపై రాగిరొట్టెను వేసి రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. 


Also read: Hibiscus Tea Benefits: మందార పువ్వుల టీ .. దీన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలకు చెక్‌..!


రొట్టె ఆరిన త‌రువాత దీనిని ముక్క‌లుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. త‌రువాత దీనిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ప‌ల్లీలు, బాదం ప‌ప్పు వేసి మిక్సీ ప‌ట్టుకుని రాగి మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి. బెల్లం పొడి, యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి జార్ లో వేసి మిక్సీ ప‌ట్టుకుని తీసుకోవాలి.  మ‌రోసారి అంతా క‌లుపుకుని ల‌డ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి ల‌డ్డూలు త‌యార‌వుతాయి. 


ఈ ల‌డ్డూలు ప‌ది రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటుంది. రోజు ఒక లడ్డు తిన‌డం ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.


Also read: Hair Fall Home Remedies: జుట్టు రాలడాన్ని తగ్గించే బియ్యం మిశ్రమం చిట్కా..ఇది రాస్తే చాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి