Weight Gain: పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఎందుకు బరువు పెరుగుతారు? కారణాలు ఇవే..
Weight Gain After Marriage: సాధారణంగా చాలా మంది పెళ్లయిన తర్వాత అధికంగా బరువు పెరుగుటుంటారు. డైట్ పాటించిన కూడా బరువు పెరుగుటుంటారు. అసలు పెళ్లయిన తర్వాత అమ్మాయిలు బరువు ఎందుకు పెరుగుతారు అంటే అందుకు అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Weight Gain After Marriage: పెళ్లయిన అమ్మాయిలు చాలా త్వరగా బరువు పెరుగుతారు. బరువు పెరగడం కారణంగా వివిధ ప్రొడెట్స్, మందులు వాడుతుంటారు. అయితే అసలు పెళ్లయిన తర్వాత బరువు ఎందుకు పెరుగుతారు అని చాలా మందికి ఈ ప్రశ్న కలుగుతుంది. దీనికి ఆరోగ్యనిపుణులు ఏం చెబుతున్నారు అంటే పెళ్లయిన తర్వాత శారీరకంగా జరిగే మార్పుల వల్ల బరువు పెరుగుతారని అంటున్నారు. కొన్ని హార్మోన్లలో జరిగే మార్పుల వల్ల, బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రతి అమ్మాయి తాము అందంగా కనిపించాలని బరువు పెరగకుండా చాలా జాగ్రత్తులు పాటిస్తుంటారు. కానీ పెళ్లయిన తర్వాత వారి శరీరం మీద శ్రద్ధ తీసుకోవడానికి సమయం ఉండదు. అంతేకుండా డైట్‌లో ఎక్కువగా జంక్, అధిక కొవ్వుతో తయారు చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరగుతారు. మహిళలు పెళ్లయిన తర్వాత వారి ఆహార పద్ధతులు మారడం కారణంగా కూడా ఈ సమస్య బారిన పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి పెరగడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఇది పెళ్లయిన అమ్మాయిలు బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతేకాకుండా మనం సౌకర్యవంతమైన జీవితం అమ్మాయిలు బరువు పెరగడానికి కారణం అవుతుంది పరిశోధనలో తేలింది.
పెళ్లయిన తర్వాత శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. బరువు పట్టింపు లేనట్టు ఆహారం తీసుకోవటం వల్ల కూడా పెరగడానికి కారణం అవుతుంది.
పెళ్లయిన తర్వాత అమ్మాయిలు ఫిట్నెస్ పైన పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల బరువు పెరుగుతారు.
అలాగే కొత్తగా పెళ్లయిన వారు బయటికి వెళ్లి విపరీతంగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా కారణం అని చెప్పవచ్చు. పెద్ద కుటుంబం, స్నేహితులు, బంధువులు మొదలైన వారిని డిన్నర్ పార్టీలకు హాజరవుతారు కాబట్టి మీ భోజనంలో తరచుగా కేలరీలు అధికంగా ఉంటుంది, పోషకాహారం తక్కువగా ఉంటుంది. దీని వల్ల కూడా బరువు పెరుగుతారు.
ఈ విధంగా అమ్మాయిలు సులువుగా బరువు పెరుగుతారు. దీనికి సరైన డైట్ ప్లాన్ పాటిస్తే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. దీని కోసం మందులు, ప్రొడెట్స్ వాడాల్సిన అవసరం లేదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also Read Summer Heat: దంచికొడుతున్న ఎండలు.. ఇంట్లోంచి బైటకు వెళ్లేటప్పుడు ఈ తప్పులు చేయోద్దంటున్న నిపుణులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter