Follow These Tips In Summer: సాధారణంగా ఏప్రిల్, మే నెలలో ఎండలు విపరీతంగా దంచికొడుతాయని చెబుతుంటారు. కానీ ఈసారి ఎండలు కాస్త ఎర్లీగానే తన ప్రతాపం చూపిస్తున్నాయి. ఇంట్లో నుంచి బైటకు వెళ్దామంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా ఉదయం పదకొండు దాటిందంటే ఉక్కపోత మొదలౌతుంది. ఇక.. సమ్మర్ లో కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతుంటారు.
Read More: Mouni Roy: 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ కొత్త అవతారం.. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా..
సమ్మర్ లో అందరు తప్పనిసరిగా నీళ్లను ఎక్కువగా తాగుతుండాలి. విపరీమైన ఎండల వల్ల.. శరీరంలో నుంచి నీళ్లు బైటకు వెళ్లిపోతుంటుంది. మార్నింగ్ టిఫిన్ తప్పనిసరిగా తినాలి. ముఖ్యంగా సమ్మర్ లో ఆయిల్ వంటకాలకు కాస్తంతా దూరంగా ఉండాలి. ఎక్కువగా శీతల పానీయాలు తాగకూడదు. వీటికి బదులుగా ఫ్రూట్స్ జ్యూస్ లు, కొబ్బరి నీళ్లు వంటివి తాగాలి. ఇంట్లో నుంచి బైటకు వెళ్లేటప్పుడు కడుపు నిండా నీళ్లు తాగి బైటకు వెళ్లాలి. బైటి ఫుడ్ అవాయిడ్ చేసి, ఇంట్లోని ఫుడ్ మాత్రమే తినాలి. సమ్మర్ లో బైటకు వెళ్లేటప్పుడు తప్పకుండా క్యాప్ లేదా స్కార్ఫ్ లు కప్పుకుని వెళ్లాలి. కొందరు బైట ఫుడ్ లు తింటుంటారు. ఇలా తింటే తరచుగా పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది.
అజీర్తీ, మంట సమస్యలు వస్తాయి. సమ్మర్ లో వాటర్ మిలన్, కీరా దోసకాయలను ఎక్కువగా తినాలి. తరచుగా నీళ్లను తాగుతుండాలి. ఎండకాలంలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండాలి. వీలైనంత ఎక్కువగా ఈ ఫుడ్ ల జోలికి అస్సలు పోకూడదు. ఇంట్లో నుంచి బైటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ ను క్యారీ చేయాలి. కొందరు .. ఉల్లిపాయను కూడా జేబులో పెట్టుకుంటారు. నిమ్మకాయ, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తింటుండాలి. బిరియానీలు, ఫ్రై వంటకాలకు, స్పైసీ డిషేస్ కు దూరంగా ఉండాలి. ఇంట్లో పిల్లలుంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
వేడిగాలులు తగలకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. ఇంట్లో ఉన్న కూడా .. కొందరు నీళ్లను తాగారు. అలా ఉండే శరీరం ఒక్కసారిగా డీహైడ్రేషన్ ప్రభావానికి గురౌతుంది. కొన్నిసార్లు రోడ్డుపైన కొందరు మైకం వచ్చి పడిపోతుంటారు. శరీరంలో షుగర్ లెవల్స్ అబ్ నార్మల్ గా మారిపోతుంటాయి. అందుకు సమ్మర్ లో జాగ్రత్తగా ఉండాలి.
Read More: Kasara Kayalu: పొలం గట్లపై ఉండే ఈ కాసర కాయలను తింటే, శరీరంలో మ్యాజిక్ జరగడం ఖాయం..
అదే విధంగా కాటన్ దుస్తులు వేసుకొవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. దుస్తులు వదులుగా ఉండాలి. ఉన్ని దుస్తులు వేసుకోకూడదు. ఆఫీసుల నుంచి వచ్చాక స్నానం చేస్తే.. చాలా రిలాక్స్ గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఫ్రెష్ గా ఉండే కూరగాయలు, పండ్లను తప్పకుండా తినాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook