Coconut Rice Recepie: కొబ్బరితో తయారు చేసే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యాని  ఎంతో మేలు కలుగుతుంది. కొబ్బరిలో ఉండే పోషకాలు శరీరానికి కావాలసిన పోషకాలను అందిస్తుంది. అయితే కొబ్బరితో తయారు చేసిన రైస్‌ ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ రైస్‌ను ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొబ్బరి రైస్  చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:


ఒక కప్పు బియ్యం ,  రెండు కప్పుల కొబ్బరి పాలు, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్‌ శనగపప్పు, రెండు టీ స్పూన్స్ నూనె, ఒక టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్‌ ఆవాలు, అర టీ స్పూన్ జీకర్ర, రెండు ఎండు మిర్చి, ఒక టీ స్పూన్ మిరియాలు, రెండు టేబుల్‌ స్పూన్‌ జీడి పప్పు పలుకులు, ఒక రెబ్బ కరివేపాకు, పావు టీ స్పూన్‌ ఇంగువ , పాపు కప్పు పచ్చికొబ్బరి తరుము


Also read: Rava Appalu: రుచికరమైన రవ్వ అప్పాలు తయారు చేసుకోండి ఇలా!


కొబ్బరి రైస్ ను ఇలా చేసుకోండి:


బియ్యాన్ని శుభ్రంగా కడగాలి.  తరువాత కుక్కర్లో వేసి కొబ్బరి పాలు, ఉప్పు, నూనె వేసి ఉడకించాలి. తరువాత రెండు విజిల్స్  తరువాత అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు కుళాయి తీసుకొని అందులో నెయ్యి వేడి చేయాలి.  తరువాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి,కరివేపాకు వేసి వేయించుకోవాలి. అనంతరం ఇంగువ, పచ్చికొబ్బరి తరుము వేసి రెండు నిమిషాలు కలుపుతూ వేయించాలి. ఇలా కొబ్బరి రైస్ రెడీ అవుతుంది.


Also read: Regi Pallu: రేగిపండ్లు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుస్తే షాక్‌ అవుతారు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter