Rava Appalu Making: బొంబాయి రవ్వతో తరుచుగా ఇంట్లో ఉపమ,కేసరి హల్వా చేస్తూ ఉంటాము. అయితే ఈ సారి కొత్తగా రుచిగా ఉండే ఈ అప్పాలను ట్రై చేయండి . అప్పాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ అప్పాల తయారీకి కావల్సిన పదార్థాలు:
ఒక కప్పు బొంబాయి రవ్వ
ఒక కప్పు పంచదార
ఒక టీ స్పూన్ యాలకుల పొడి
ఒక కప్పు నీళ్లు
డీప్ ఫ్రైకు సరిపడా నూనె
Also read: Regi Pallu: రేగిపండ్లు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుస్తే షాక్ అవుతారు!
అప్పాలు తయారు చేసుకోండి ఇలా :
ముందుగా ఒక గిన్నెలో రవ్వను, పంచదారను, యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోకి రవ్వ వేసి కలపాలి. రవ్వ మెత్తగా ఉడికించి పక్కకి తీసుకోవాలి. తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అప్పాలు తయారు చేయాలి. అనంతరం ఓ కళాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇందులోకి తయారు చేసుకున్న అప్పాలను వేసి కాల్చుకోవాలి. రెండు పక్కల కాల్చుకుని పక్కకు తీసుకోవాలి.
ఈ విధంగా రవ్వ అప్పాలు తయారవుతాయి. ఈ అప్పాలు 3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. సులువుగా ఈ అప్పాలను తయారు చేసుకొని తినవచ్చు.
Also read: Hair Dandruff: ఈ రసంతో చుండ్రు సమస్యలకు చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter