Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్‌తో చెడు కొలెస్ట్రాల్‌కు బైబై!
Beetroot Juice For Bad Cholesterol: అధిక చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా? చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బీట్‌రూట్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్ వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Beetroot Juice For Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ అంటే మన శరీరంలోని కొవ్వు పదార్థాలలో ఒకటే కొలెస్ట్రాల్. ఇది రెండు రకాలు.. మంచి కొలెస్ట్రాల్ (HDL), చెడు కొలెస్ట్రాల్ (LDL). చెడు కొలెస్ట్రాల్ (LDL) అనేది ధమనుల గోడలపై పేరుకుపోయిన ఫలకం. ఈ ఫలకం రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది. LDL కొలెస్ట్రాల్ ధమనులను గట్టిపరిచి, గుండెకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. మెదడుకు రక్త ప్రవాహాన్ని అందించే ధమనులలో ఫలకం ఏర్పడితే, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
చెడు కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది?
చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సంతృప్త కొవ్వులు (ఎర్ర మాంసం, వెన్న, పాలు) ట్రాన్స్ కొవ్వులు (బేకరీ ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్) చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో పాటు అధిక కేలరీల ఆహారం తీసుకోవడం ఊబకాయానికి దారితీస్తుంది, ఇది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే కారణాలలో ఒకటి. ప్రతిరోజు వ్యాయామం చేయకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగడం జరుగుతుంది. అధిక మద్యం సేవనం కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడానికి దారితీసి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. వయసు పెరిగే కొద్దీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం సహజం. డయాబెటిస్, హైపర్‌థైరాయిడిజం వంటి వ్యాధులు కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి.
చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కలిగే ప్రమాదాలు:
గుండె జబ్బులు: గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి
స్ట్రోక్: మెదడుకు రక్త ప్రసరణ అందకపోవడం
పరిధీయ ధమనుల వ్యాధి: కాళ్ళు, చేతులకు రక్త ప్రసరణ తగ్గడం
చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి బీట్‌రూట్‌జ్యూస్ ఎంతో సహయపడుతుంది. బీట్‌రూట్‌లో పుష్కలంగా ఉండే నైట్రేట్స్ అనే పదార్థాలు రక్తనాళాలను విశాలం చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది రక్తపోటును తగ్గించడానికి, గుండెకు మంచి చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి బయటకు పంపడంలో సహాయపడుతుంది.
ఎలా తాగాలి?
రోజుకు ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగితే సరిపోతుంది.
ఇతర పండ్ల రసాలతో కలిపి తాగవచ్చు.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తాగే ముందు వైద్యులను సంప్రదించాలి.
గమనిక: ఈ సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా వైద్య సమస్య కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి