Ice Apple Milkshake Recipe:  వేసవికాలం అనగానే మామిడిపళ్ళ తర్వాత అందరికీ గుర్తొచ్చేది తాటి ముంజలు. ఎంతో టేస్టీగా ఉండే తాటి ముంజలతో చేసే మిల్క్ షేక్.. కూడా ఇంకా రుచిగా ఉంటుంది. అంతేకాదు.. ఎంతో సులువుగా.. చాలా తక్కువ సమయంలో చేసుకోగలిగే  ఈ తాటి ముంజల మిల్క్ షేక్ రుచిగా ఉండటంతో పాటు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వేసవికాలంలో మామిడి పండ్లతో డ్రింక్స్ చేసుకుని విసిగిపోయిన వారు.. ఒక్కసారి అయినా తాటి ముంజలతో..ఇలా మిల్క్ షేక్ చేసి తాగితే.. రోజు ఇదే తాగాలి అనిపిస్తుంది. రుచికి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదైనా ఈ సమ్మర్ డ్రింక్ తాటి ముంజల మిల్క్ షేక్ సులువుగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం..


తయారీ విధానం :


తాటి ముంజలతో మిల్క్ షేక్ చేయడం కోసం ముందుగా నాలుగు తాటి ముంజలను తీసుకొని వాటి పై ఉండే తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోండి. అందులోనే సరిపడా పంచదారను కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఆ తరువాత అందులోనే కొంచెం పాలను కూడా పోసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి. 


ఇప్పుడు ఒక గ్లాసులో ఒక గంట సేపు నానబెట్టిన సబ్జా గింజలను రెండు స్పూన్లు వేసుకోండి. అందులోనే తాటి ముంజల జ్యూస్ కూడా వేసి కొంచెం కలిపితే చాలు. ఎంతో రుచికరమైన తాటి ముంజల మిల్క్ షేక్ రెడీ.
ఇక అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని తాగితే ఒంటికి చలవ చేయడంతో పాటు వేసవి తాపం మన దరి దాపులోకి రాదు


ఆరోగ్యానికి ఔషధం:


అంతేకాదు ఈ మిల్క్ షేక్ తాగడం వల్ల బరువు కూడా పెరగం. తాటి ముంజలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ వేసవికాలంలో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తాటి ముంజలను.. తీసుకోవడం ఎంతో మంచిదని చెబుతూ ఉంటారు వైద్య నిపుణులు. దీన్ని తినడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా నీలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతే కాదు స్థూలకాయంతో బాధపడేవారు తాటిముంజలను తినాలి. ఈ పండులో క్యాలరీ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. తాటి ముంజలు తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు.. ఎందుకంటే అందులో అధిక శాతం నీరు ఉంటుంది. ఈ కారణం వల్ల ఆకలిని నియమంలో ఉంచడంతోపాటు.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.


Also Read: Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ను వెంటాడుతున్న మృత్యువు.. మరో గ్యాంగ్‌ అరెస్ట్‌


Also Read: Cows Death: మూగ రోదన.. లారీలో కుక్కేయడంతో ఊపిరాడక 16 ఆవులు మృతి



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter