Relationship Tips: కాబోయే భార్యను తొలిసారి కలవబోతున్నారా... అయితే ఈ టిప్స్ మీకోసమే...
Relationship Tips: కాబోయే అమ్మాయిని తొలిసారి కలవబోతున్నారా.. అయితే కొన్ని టిప్స్ పాటించడం చాలా అవసరం.. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..
Relationship Tips: పెళ్లి అనేది జీవితంలో ముఖ్య ఘట్టం. మనిషి జీవితాన్ని పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని చెప్పొచ్చు. అందుకే పెళ్లికి ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని మన పెద్దలు చెబుతారు. పెళ్లి కుదిరిందంటే.. కాబోయే భార్యను పెళ్లికి ముందు ఒకసారైనా కలవాలని చాలామంది భావిస్తారు. అయితే ఈ తొలి కలయిక ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలంటే కొన్ని టిప్స్‌ను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ఆకర్షణీయంగా ఉండే దుస్తులు :
కాబోయే భార్యను కలిసేందుకు వెళ్లేటప్పుడు మంచి దుస్తులు ధరించండి. మీ దుస్తులను బట్టి మీరెలాంటివారో అమ్మాయి ఒక అంచనాకు వస్తుంది. సాధ్యమైనంతవరకు మరీ మోడర్న్‌గా, ఫంకీగా ఉండే దుస్తులు ధరించకపోవడమే మంచిది. మంచి షర్ట్, ఫార్మల్ ప్యాంట్ లేదా జీన్స్, చేతికి వాచ్, షూస్ ధరించండి. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని గుర్తుంచుకోండి.
ఇది చాలా ముఖ్యం :
కాబోయే అమ్మాయిని కలిసేందుకు మంచి ప్రదేశాన్ని ఎంచుకోండి. రద్దీగా ఉండే ప్రదేశం కాకుండా ప్రశాంతంగా ఉండే చోటును ఎంచుకోండి. అక్కడైతేనే ఇద్దరూ కాసేపు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ మాల్స్‌లో మీటింగ్ మంచి ఛాయిస్ కాదు. మీటింగ్ తర్వాత వీలైతే మంచి రెస్టారెంట్‌కి తీసుకెళ్లండి.
హద్దుల్లో ఉండండి :
తొలిసారి కలిసినప్పుడే మీద మీద పడినట్లు చేయొద్దు. పిచ్చి జోక్స్ వేయవద్దు. నోటిని కాస్త అదుపులో పెట్టుకోవాలి. ఫన్ ముఖ్యమే.. కానీ ఒక హద్దు ఉండాలని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు వేసే జోక్స్ మిస్‌ఫైర్ అయ్యాయనుకోండి.. మొదటికే మోసం. ఆమె ఇష్టాలను గౌరవిస్తూ మీ అభిప్రాయాలను పంచుకోండి. అంతేకానీ, ఆమె భావాలను లేదా ఇష్టాలను తేలిగ్గా తీసిపారేయకండి.
Also Read:Employees Salarys: రెండు వారాలైనా ఉద్యోగులకు నో జీతం.. బంగారు తెలంగాణలో కొత్త అప్పు పుడితేనే మోక్షం
Also Read: Telangana EAMCET: తెలంగాణలో తగ్గని భారీ వర్షాలు.. ఎంసెట్ వాయిదా యోచనలో సర్కార్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook