White Mustard Benefits: తెల్ల ఆవాలతో కలిగే లాభాలు తెలిస్తే వాటిని వదిలిపెట్టకుండా ఆహారాల్లో వినియోగిస్తారు!
White Mustard Benefits: తెల్ల ఆవాలతో తయారుచేసిన నూనెను తీవ్ర శరీర నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు మర్దన చేసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వీటిని ఆహారాల్లో వినియోగించడం వల్ల అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి.
White Mustard Benefits: మన వంటింట్లో ఎక్కువగా వినియోగించే పోపు దినుసులు ఆవాలు ఒకటి.. ఆవాలు ఆహారాల రుచిని రెట్టింపు చేస్తాయి. అందుకే అందరూ వీటిని ప్రతి ఆహారంలో వినియోగిస్తూ ఉంటారు. ఇవి నోటికి రుచి అందించడమే కాకుండా శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మనం చాలావరకు నలుపు రంగుతో కూడిన ఆవాలను వినియోగిస్తూ ఉంటాము. మీరెప్పుడైనా తెలుపు రంగుతో కూడిన ఆవాలను చూశారా.. చూడని వారికోసం మేము పరిచయం చేయబోతున్నాం. వీటిని ప్రతిరోజు వినియోగించడం వల్ల కలిగే లాభాలు, అలాగే ఇందులో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా నల్ల ఆవాల్లో లభించే పోషకాల కంటే తెల్ల ఆవాల్లో ఉండే పోషకాలే అధికమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల వ్యాధులకు ప్రభావవంతంగా సహాయపడతాయని వారంటున్నారు. తెల్ల వాళ్ళు ఫైబర్, విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి6, బి9, సి, ఇ, కె, ఐరన్ లు అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. విదేశీయులు ఎక్కువగా సలాడ్స్ లో తెల్ల ఆవాలతో తయారుచేసిన పొడులని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
తెల్ల ఆవాలను ప్రతిరోజు ఆహారంలో వినియోగించడం వల్ల అన్ని రకాల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని పెంచి మెదడు పనితనాన్ని కూడా మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు సమస్యలతో బాధపడే వారికి ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు ప్రభావంతంగా సహాయపడతాయి. ఆవాల పొడి తో తయారు చేసిన కషాయాన్ని ప్రతిరోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా తీవ్రవాదుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
నరాల బలహీనత తిమ్మిర్లు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తెల్ల ఆవాలతో తయారుచేసిన టీ ని ప్రతిరోజు తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఔషధ గుణాలు గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. ఈ తెల్ల ఆవాలతో తయారు చేసిన నూనెను శరీరానికి మసాజ్ చేసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద పనులు చెబుతున్నారు. ఈ నూనెలో ఉండే ఔషధ గుణాలు శరీర నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు కూడా సహాయపడతాయి.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook