Remedy For Yellow Teeth: సులభంగా ఇలా పసుపు దంతాలను శుభ్రం చేసుకోండి..!
Remedy For Yellow Teeth: మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల ఆహారలను తీసుకుంటున్నారు. దీని వల్ల దంతాలలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి.
Remedy For Yellow Teeth: మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల ఆహారలను తీసుకుంటున్నారు. దీని వల్ల దంతాలలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది దంతాలు పసుపుగా మారడం వంటి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొంది.. ముత్యాల్లా మెరవడానికి ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి రోజు బ్రష్ చేయండి:
కొందరికి బ్రష్ చేయక ముందు టీ బిస్కెట్లు తినే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు దంతక్షయం మొదలవుతుంది. కాబట్టి నిద్రలేచిన వెంటనే బ్రష్ చేసుకోవాలి.
లవంగాల పొడితో కూడా పసుపు దంతాలు తెల్లగవుతాయి:
లవంగాల పొడితో పసుపు పళ్ళు కూడా తెల్లగా మారుతాయి. దీని కోసం ఆలివ్ నూనెలో లవంగాల పొడిని మిక్స్ చేసి.. పసుపు పళ్ళకు అప్లై చేయాలి. ఇది నోటి దుర్వాసనను తగ్గించి.. బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
నిమ్మరసం కూడా సహాయపడుతుంది:
నిమ్మరసం కూడా పసుపు దంతాలను ముత్యాల్లా చేస్తుంది. అందుకని నిమ్మరసంలో ఆవాలనూనె, ఉప్పు కలిపి పేస్టులా చేసుకోవాలి. దానితో బ్రష్ చేయండి.
యాపిల్ వెనిగర్‌తో కూడా దంతాలు తెల్లగా అవుతాయి:
పసుపు పళ్లను తెల్లగా మార్చడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా సహాయపడుతుంది. దీని కోసం.. ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకోవాలి. దీనితో నెమ్మదిగా బ్రష్ చేయండి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: How To Get Good Sleep: రాత్రి పూట సరిగ్గా నిద్రపోలేక పోతున్నారా.. అయితే ఇది ట్రై చేయండి..!
Also Read: Benefits of Mushrooms: మష్రూమ్స్ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook