Hair Products Increase Cancer: ప్రస్తుతం ఎక్కువ మంది మెరిసే జుట్టు.. స్ట్రైట్ హెయిర్ కావాలని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. మార్కెట్‌లో దొరికే హెయిర్ జెల్స్‌ వాడుతూ జుట్టును పాడు చేసుకుంటున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతున్నాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. జుట్టును మృదువుగా చేసే స్ట్రెయిటెనింగ్ ప్రొడక్ట్స్‌, ఇతర ఫార్మాల్డిహైడ్ విడుదల చేసే కెమికల్స్ వాడకాన్ని నిషేధించాలని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు మన దేశంలోని వైద్యులు కూడా సపోర్ట్ చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లోని క్లినికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్ఞా శుక్లా మాట్లాడుతూ.. క్యాన్సర్ పరిశోధనపై అంతర్జాతీయ ఏజెన్సీ (IARC), నేషనల్ టాక్సికాలజీ చేసిన పరిశోధనలో స్ట్రెయిట్‌నర్‌లో ప్రమాదకరమని చెప్పారు. నాసోఫారింజియల్, సైనోనాసల్ క్యాన్సర్‌తో పాటు లుకేమియా ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. మన దేశంలో హెయిర్ స్ట్రెయిటెనింగ్ కోసం ఉపయోగించే కెమికల్స్‌లో ఫార్మాల్డిహైడ్ విరివిగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇది పదేపదే ఉపయోగించడంతో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందన్నారు.


15 ఏళ్లకు పైగా.. సంవత్సరానికి కనీసం ఐదు సార్లు ఇటువంటి చికిత్స చేయడం వల్ల గర్భాశయం, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చికిత్సలకు దూరంగా ఉండటం మంచిదని అభిప్రాయపడుతున్నారు. మొదట్లో ఇలాంటి కెమికల్స్ వల్ల కంటి మంట, ముక్కు-గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. అయితే దీర్ఘకాలం వాడితే బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. 


Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల


Also Read: Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు! 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter