Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల, జగన్ హాజరయ్యేనా

Ys Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల కుమారుడి వివాహంపై అధికారిక ప్రకటన వెలువడింది. పెళ్లిపై వైఎస్ షర్మిల అధికారికంగా స్పందించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2024, 01:46 PM IST
Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల, జగన్ హాజరయ్యేనా

Ys Sharmila: ఇప్పటి వరకూ సోషల్ మీడియా వార్తలకే పరిమితమైన వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి వ్యవహారం ఇప్పుడు అధికారికమైంది. ఫిబ్రవరి 17న కుమారుడి పెళ్లి జరగనుందని వైఎస్ షర్మిల అధికారికంగా ట్వీట్ చేసింది. 

అమెరికాలోని డల్లాస్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేసిన వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, చట్మీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనుమరాలు అట్లూరి ప్రియలు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఇరువురి కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన లేదు. ఇప్పుడు తన కుమారుడి ప్రేమ పెళ్లి వ్యవహారంపై వైఎస్ షర్మిల అధికారికంగా స్పందించారు. ఇద్దరి నిశ్చితార్ధం, పెళ్లి తేదీలను ప్రకటించారు. 

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..నా కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్ధం జరగనుంది. ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుందనే సంగతి మీతో పంచుకోవడం ఆనందాన్నిస్తోంది. జనవరి 2న కుటుంబసమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్ సందర్శించి ఆక్కడ ఆహ్వాన పత్రిక ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటాం అని వైఎస్ షర్మిల ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

అయితే పెళ్లి ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరికి ఆహ్వానం అందుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది. సోదరి కుమారుడి పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కానున్నారా లేదా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. 

Also read: Ap New Pension Scheme: సంక్షేమ పథకాలతో ఎన్నికల ఏడాది ప్రారంభం, ఇవాళ్టి నుంచి 3 వేల పెన్షన్, కొత్త రేషన్ కార్డులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News