Rice Flour Face Pack: ప్రస్తుతం చాలా మంది చర్మ సంరక్షణ కోసం వివిధ రకాల ప్రోడక్ట్‌ వినియోగిస్తున్నారు. అయితే దీని వల్ల చాలా రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ఛాన్స్‌ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చర్మ సంరక్షణ కోసం, చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి తప్పకుండా పలు పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బియ్యంతో తయారు చేసిన ఫేస్‌ ఫ్యాక్‌ను వినియోగించాల్సి ఉంటుంది. పిండిలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ముఖాన్ని గ్లో చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల చర్మ సమస్యలకు చెక్‌ పెట్టడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాబట్టి దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బియ్యం పిండి ఫేస్ ప్యాక్స్:
బియ్యం పిండి, కలబంద ఫేస్ ప్యాక్‌:

బియ్యం పిండితో తయారు ఫేస్ ప్యాక్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్ల బియ్యప్పిండిని తీసుకుని అందులో సమాన పరిమాణంలో అలోవెరా జెల్ కలపాలి. బాగా మిక్స్ చేసి ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల  చనిపోయిన చర్మ కణాలు తొలగిపోయి. చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


బియ్యం పిండి, గుడ్డు:
కొంతమంది ముఖంపై ఫేస్‌ ఫ్యాక్‌లా గుడ్లు రాసుకుంటున్నారు. అయితే ఇలా రాసుకోవడం వల్ల కూడా చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. రెట్టింపు ప్రయోజనాలు పొందడానికి గుడ్లని సొనలో ఒక చెంచా బియ్యప్పిండి వేసి, మిశ్రమంలా కలపాల్సి ఉంటుంది. ఇలా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని, అంతేకాకుండా ముఖం కాంతివంతంగా తయారవుతుంది.


రైస్ ఫ్లోర్, గ్రీన్ టీ:
మెరిసే, శుభ్రమైన చర్మాన్ని పొందడానికి ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయవచ్చు. దీన్ని చేయడానికి గ్రీన్ టీ బ్యాగ్‌ను వేడి నీటిలో ఉంచండి.  ఈ నీటిలో 2 చెంచాల బియ్యప్పిండి వేసి  నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ప్రతి రోజూ ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.


Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి 


Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి