Rose Water: చందమామలా మెరిసే ముఖం కోసం రోజ్ వాటర్ .. ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలా!!
Home Made Rose Water: రోజ్ వాటర్ చర్మ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. మార్కెట్లో రోజ్ వాటర్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో కెమికల్స్ కలుపుతారు. దీని వల్ల చర్మాన్నికి మచ్చలు, మొటిమలు కలుగుతాయి. అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Home Made Rose Water: మహిళలు తమ చర్మ సంరక్షణలో రోజ్ వాటర్‌ను ఎంతగా వినియోగిస్తున్నారో చెప్పనక్కర్లేదు. ఇది ఎందుకు అంత ప్రాచుర్యం పొందిందో తెలుసుకుందాం. అయితే మార్కెట్లో దొరికే రోజ్ వాటర్‌కు బదులుగా ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. బయట లభించే రోజ్ వాటర్‌లో హానీకరమైన కెమికల్స్ ఉంటాయి. దీని వల్ల మొటిమలు, మచ్చలు కలుగుతాయి. అయితే సహాజంగా ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
రోజ్ వాటర్ ఉపయోగాలు:
చర్మం ఎర్రబడటం, మంటను తగ్గించడంలో రోజ్ వాటర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మొటిమల వల్ల కలిగే మంటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
చర్మ రంధ్రాలను శుభ్రపరచి, బిగించడంలో రోజ్ వాటర్‌కు ఉన్న సామర్థ్యం అందరికీ తెలుసు. ఇది చర్మాన్ని తాజాగా మరియు మెరిసేలా చేస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచడంలో రోజ్ వాటర్ కీలక పాత్ర పోషిస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి ఇది వరం లాంటిది. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ముడతలు పడకుండా తొలగిస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడడంలో రోజ్ వాటర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కావలసినవి:
తాజా గులాబీ రేకులు
నీరు
స్టెయినర్ లేదా జల్లెడ
క్లీన్ గ్లాస్ బాటిల్
తయారీ విధానం:
తాజా గులాబీ రేకులను బాగా కడగండి. వాటిపై దుమ్ము, మట్టి లేకుండా చూసుకోండి. ఒక పాత్రలో నీరు తీసుకొని మరిగించండి. నీరు మరిగిన తర్వాత గులాబీ రేకులను నీటిలో వేసి స్టవ్ ఆఫ్ చేయండి. కనీసం 4-5 గంటలు నీటిని చల్లగా చేయండి. చల్లారిన నీటిని స్టెయినర్ లేదా జల్లెడ ద్వారా ఒక క్లీన్ గ్లాస్ బాటిల్‌లోకి ఫిల్టర్ చేయండి. రోజ్ వాటర్‌ను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి.
చర్మ సంరక్షణలో రోజ్ వాటర్ ఉపయోగాలు:
టోనర్‌గా: రోజూ ముఖం కడిగిన తర్వాత రోజ్ వాటర్‌తో ముఖం తుడుచుకోవడం వల్ల చర్మం రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. ముఖంపై ఉన్న మలినాలను తొలగిస్తుంది.
మాయిశ్చరైజర్‌గా: రోజ్ వాటర్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పొడిబారడాన్ని నివారిస్తుంది.
మొటిమల నివారణ: రోజ్ వాటర్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలను తగ్గిస్తుంది. మొటిమల వచ్చిన చోట రోజ్ వాటర్‌ను తుప్పులుగా వేసి ఉంచవచ్చు.
చర్మాన్ని ప్రకాశవంతం చేయడం: రోజ్ వాటర్ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.
ముడతలను తగ్గించడం: రోజ్ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ముడతలను తగ్గిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
కళ్ళు చల్లబరచడం: రోజ్ వాటర్ ప్రతిరోజు ఉపయోగించడం వల్ల కళ్ళు చల్లబడుతాయి. దీని వల్ల నల్ల వలయాలు తగ్గుతాయి.
Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook