Side Effects Of Consuming Too Much Salt: ఉప్పు లేకుండా ఆహార పదార్థాలు తినడం చాలా కష్టం..అలాగే అతిగా ఉప్పున్న ఆహారాలు తినడం కూడా కష్టం. తగిన పరిమాణంలో ఉన్న ఆహారాలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. అతిగా ఉప్పును తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం రోజుకు 5 గ్రాముల ఉప్పు (సుమారు 2 గ్రాముల సోడియం) మాత్రమే తీసుకోవాలి. ఒక వేళ అధిక ఉప్పు తీసుకుంటే అధిక రక్తపోటుతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉప్పును అతిగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక రోజులో ఎంత ఉప్పు తినవచ్చు?
WHO ప్రకారం.. అధిక ఉప్పు తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం అవుతోందని పేర్కొంది. ఎక్కువగా సోడియం తీసుకోవడంతో పాటు అయిల్‌ ఫుడ్స్‌ అధికంగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా తగిన పరిమాణంలో మాత్రమే ఉప్పును తీసుకోవాల్సి ఉంటుంది.


ఉప్పు మీ జీవితాన్ని నాశనం చేస్తుంది:
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలంలో చేప సాస్ లేదా సోయా సాస్ ద్వారా ఉప్పు తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇలా తీసుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 2.5 మిలియన్ల మరణాలు  జరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఉప్పు తీసుకోవడం ఎందుకు అవసరం?
ఉప్పు మన శరీరానికి మాత్రమే హానికరం అని కాదు. సోడియం, పొటాషియం రెండూ ఇందులో కనిపిస్తాయి. దీని కారణంగా శరీరంలోని నీటి స్థాయి సరైన పరిమాణంలో ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు పంచేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.


వీటిలో ఎక్కువ సోడియం ఉంటుంది, కాబట్టి వీటిని తినకపోవడం చాలా మంచిది:


  • ప్రాసెస్ చేసిన మాంసం

  • క్యాన్డ్ మీట్

  • సాసేజ్

  • పిజ్జా

  • వైట్ బ్రెడ్

  • సాల్టెడ్ నట్స్

  • కాటేజ్ చీజ్

  • సలాడ్ డ్రెస్సింగ్

  • ఫ్రెంచ్ ఫ్రైస్

  • పొటాటో చిప్స్

  • హాట్ డాగ్స్

  • పికిల్స్

  • సోయా సాస్

  • ఫిష్ సాస్

  • టొమాటో సాస్

  • ఫ్రోజెన్ సీ ఆహారం


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


ఇది కూడా చదవండి : Tata Micro SUV @ Rs 6Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్‌యూవీ, ధర కేవలం రూ.6 లక్షలే!


ఇది కూడా చదవండి : 3 Lakhs Discount Cars: మార్చి బొనాంజా.. ఈ 5 కార్లపై 3 లక్షల వరకు తగ్గింపు! బెస్ట్ ఎస్‌యూవీ కొనడానికి ఉత్తమ సమయం ఇదే


ఇది కూడా చదవండి : Best Hatchback Cars: బెస్ట్‌ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook