Samosa: సమోసాలు, పకోడాల పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. స్ట్రీట్‌లో లభించే వీటిని తినేందుకు కొంత మంది చాలా ఇష్టపడతారు. అయితే వీటిని రెగ్యూలర్‌గా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే సమోసాలు, పకోడాలను తయారు చేసే క్రమంలో కలుషితమైన నూనెలను వాడుతున్నారని.. వీటిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తింటే శరీర సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నూనెలతో కొన్ని సందర్బాల్లో క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాన్సర్‌కు కారణాలు:


ప్రస్తుతం చాలా మంది స్ట్రీట్‌ ఫుడ్స్‌ చేసే క్రమంలో ఒకే నూనెను తరుచుగా వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల నూనెలోని పోషకాలు తొలగిపోయి నూనె కలుషితంగా మారే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ ఏర్పడి వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయి. కావున నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడకుండా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.


ట్రాన్స్ ఫ్యాట్ ప్రమాదం:


ఈ అంశంపై రియాలిటీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ దీపాంకర్ ఈ విధంగా వివరించారు.. తరుచుగా వాడే నూనెలతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండడం మంచిదని పేర్కొన్నారు. ఇలా పదే పదే వినియోగించిన నూనెలను వాడడం వల్ల శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్ పెరిగే అవకాశాలున్నాయి. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.


ధమనులలో సమస్యలు:


ఈ కలుషితమైన నూనెను పదే పదే వాడడం వల్ల గుండెలోని ధమనులలో ఉష్ణోగ్రత, కొవ్వు పెరిగి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా దీని వల్ల ఎసిడిటీ, గుండె జబ్బులు, అల్జీమర్స్ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు వివరిస్తున్నారు.


నూనెను ఒకసారి మాత్రమే వాడాలి:


నూనెను ఒక సారి వినియోగించామంటే మళ్లీ దానిని వినియోగించకుండా ఉండడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే తరుచుగా వినియోగించడం వల్ల నూనె రంగు మారి.. అది కలుషిత నూనెలా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వీటితో చేసిన వంటకాలను తినడం వల్ల కాన్సర్ వంటి సమస్యలు వస్తున్నాయని నిపునులు చెబుతున్నారు. కావున ఒక సారి వినియోగించిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగించకూడదని వారు తెలుపుతున్నారు.



(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Read also:  Worst Breakfast Food: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని అస్సలు తినొద్దు..!


Read also:  Swimming Benefits in Arthritis: ఎన్ని మందులు వాడిన ఆర్థరైటిస్ సమస్యలు తగ్గడం లేదా.. అయితే ఇలా చేయండి..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook