Swimming Benefits in Arthritis: ఎన్ని మందులు వాడిన ఆర్థరైటిస్ సమస్యలు తగ్గడం లేదా.. అయితే ఇలా చేయండి..!

Swimming Benefits in Arthritis: ప్రస్తుతం చాలా మంది నడుమునొప్పి, కీళ్లనొప్పులు, కీళ్లవాపుల సమస్యల బారిన పడుతున్నారు. అయితే చాలా మంది నిపుణుల ఈత కొట్టడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 10, 2022, 04:55 PM IST
  • ఏం చేసిన ఆర్థరైటిస్ సమస్యలు తగ్గడం లేదా..
  • రోజూ స్విమ్మింగ్ చేయండి
  • కీళ్లనొప్పులు, కీళ్లవాపుల సమస్యల పోతాయి
Swimming Benefits in Arthritis: ఎన్ని మందులు వాడిన ఆర్థరైటిస్ సమస్యలు తగ్గడం లేదా.. అయితే ఇలా చేయండి..!

Swimming Benefits in Arthritis: ప్రస్తుతం చాలా మంది నడుమునొప్పి, కీళ్లనొప్పులు, కీళ్లవాపుల సమస్యల బారిన పడుతున్నారు. అయితే చాలా మంది నిపుణుల ఈత కొట్టడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. అయితే ఈ సమస్యలు అనారోగ్యకరమైన ఆహారం తీసకోవడం వల్లే వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని నుంచి విముక్తి పొందడానికి  ఈత ఒక  విరుగుడని నిపుణులు తెలుపుతున్నారు. కావున ఈ సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా స్విమ్మింగ్ చేయాలి. అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది. అయితే ఈత కొట్టడం వల్ల ఆర్థరైటిస్‌ సమస్యలు ఎలా తొలగిపోతాయో తెలుసుకుందాం..

ఆర్థరైటిస్ అంటే ఏమిటి?:

ఆర్థరైటిస్ అనేది కీళ్లు, నడుములో వచ్చే నొప్పి, వాపు వంటి సమస్యలు. ఈ సమస్యల బారిన 50 నంవత్సరాల వయసులో ఉన్నవారు ఎక్కువగా లోనవుతున్నారు. ఆర్థరైటిస్‌ అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ఆస్టియో ఆర్థరైటిస్, రెండవది రుమటోడార్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్‌ బారినపడితే.. శరీరంలోని కీళ్ల కణజాలాలు చాలా గట్టిగా మారతాయి. అంతేకాకుండా ఎముకల చివరన కణజాలం క్రియారహితంగా తాయారవుతుంది. ఇలా కావడం వల్ల నిలబడి, కూర్చున్నప్పుడు కీళ్ల నొప్పిలు వస్తాయి. రెండో రకమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్.. కీళ్ల ఎముకల రెండు చివర్ల నుంచి ఈ వ్యాధి మొదలవుతుంది. ఇది ఎముకలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి. ఇది సంభవిస్తే.. శరీరంలో రోగనిరోధక శక్తి  కీళ్ళపై దాడి చేస్తుంది.

స్విమ్మింగ్ చేయడం వల్ల ఆర్థరైటిస్ నొప్పిలు ఎలా తగ్గుతాయి:

క్రమం తప్పకుండా ఈత కొట్టడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీరాన్ని దృఢంగా చేస్తుంది. దీంతో కీళ్లలో వాపులు, నొప్పులు తొలగిపోతాయి. రోజూ స్విమ్మింగ్ చేయడం వల్ల కండరాల బలం పెరుగుతుంది. తద్వారా నొప్పి తీవ్రత తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది కండరాల దృఢత్వాన్ని తగ్గించి..ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది.

కావున పై సమస్యలతో బాధపడుతుంటే క్రమం తప్పకుండా ఈత కొట్టడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్విమ్మింగ్ శరీరానికి ఒక రకమైన హైడ్రోథెరపీగా పనిచేస్తుంది. అయితే శరీరంలో 70 శాతం నీరుంటే.. ఈత కొట్టడం వల్ల వీటిల్లో మార్పులు వస్తాయి.

Also Read: HEAVY RAINS:తెలంగాణలో కుంభవృష్ణి.. భూపాలపల్లి జిల్లాలో 323 మిల్లిమీటర్ల వర్షం.. వరదలతో  జనం అతలాకుతలం

Also Read: England vs India : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ మనదే.. రెండో టీ20లో టీమిండియా సునాయాస విజయం..  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News