Sattu Pindi :బరువు తగ్గాలి అనుకునే వారికి నాచురల్ సూపర్ ఫుడ్..ఈ
Sattu Pindi Benefits: అస్తవ్యస్తమైన జీవన శైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి అంటే చాలా కష్టమైపోతుంది. ప్రత్యేకంగా డైట్ చేయాలి అంటే ఏం తినాలో అర్థం కాదు. అలాంటి వారి కోసం సహజంగా బరువు తగ్గించే ఈ సూపర్ రిచ్ ఫుడ్ గురించి తెలుసుకుందాం..
Sattu Pindi: ప్రస్తుత సమాజంలో చాలామంది బాధపడుతున్న ప్రధాన సమస్య అధిక బరువు. అధిక బరువు కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే అందరూ బరువు తగ్గించుకొని హెల్తీగా ఉండాలి అని అనుకుంటారు కానీ అది ఎలా చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నారు. జిమ్, యోగ ,ఎక్ససైజ్ లాంటివి రెగ్యులర్ గా చేయాలి అంటే సమయం సరిపోదు. పోనీ డైటింగ్ చేద్దామా అంటే ఏం తినాలి? ఎలా తినాలి? తెలియదు. అలాంటివారికి సహజంగా ఇంటి వద్దనే బరువు తగ్గించుకునే వసతి ఉంది అంటే నమ్ముతారు.
ఇది నిజమండి బాబు.. ఈ ఒక్క మ్యాజికల్ పిండి మీ లైఫ్ ని పూర్తిగా మార్చేస్తుంది. రోజు ఉదయం అల్పాహారంలో సత్తు పిండి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అధిక బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా పలు రకాల ప్రయోజనాలు చేకూరతాయి. అంతేకాదు శరీరంలో పేర్కొన్న టాక్సిన్స్ ని కూడా ఈ పిండి క్రమంగా తొలగించడంలో సహాయపడుతుంది. భారతదేశంలో పలు ప్రాంతాలలో ఈ పిండిని ప్రోటీన్ పౌడర్ ప్రత్యామ్నాయంగా వాడుతారు.
అందుకే దీనికి పేదవారి ప్రోటీన్ పొడి అని పేరు కూడా వచ్చింది. చవకగా వస్తే మనవారికి రుచించదు. కాబట్టి వేలు వేలు ఖర్చు పెట్టి బయట దొరికే కెమికల్ ఫుడ్ తింటారు తప్ప మనకు లభించే సహజమైన ఫుడ్ ను తీసుకోవడం ఇష్టపడరు. అందుకే ఇటువంటి సహజమైన మంచి ఆహారాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి.ఈ పిండితో పలు రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఈ పిండి మార్కెట్లోనూ దొరుకుతుంది .కావాలి అనుకుంటే ఇంటి వద్ద కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు.
శనగలు, గోధుమలు, రాగులు వంటి తృణధాన్యాలు కలిపి మెత్తటి పొడిగా చేసుకుని వస్త్ర కాయం పట్టుకోవాలి. అంతే మీ సత్తుపిండి రెడీ. దీంతో దోశల దగ్గర నుంచి లడ్డూల వరకు ఏమి కావాలన్నా శుభ్రంగా చేసుకొని తినవచ్చు. సత్తు పిండితో జావలాగా కాసుకొని తాగడం వల్ల శరీరంలోని అధిక వేడి తగ్గుతుంది. పైగా ఇందులో ప్రోటీన్ ,ఫైబర్ ,కాల్షియం, ఐరన్ ,మాంగనీస్ ,మెగ్నీషియం లాంటి పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి.
బరువు తగ్గాలి అనుకునే వారు పొద్దున పరగడుపున ఈ పౌడర్ ని తీసుకోవడం వల్ల ఊబకాయం క్రమంగా తగ్గుతుంది.ఇది శరీరంలోని జీవక్రియను మెరుగుపరచడంతో పాటు తీసుకున్న ఆహారం సులభంగా డైజెస్ట్ అయ్యేలా సహాయపడుతుంది. కడుపు నింపిన అనుభూతిని కలిగించి ఎక్కువ ఆహారం తీసుకొని కుండా అరికడుతుంది. అందుకే బరువు తగ్గాలి అనుకునే వారికి సత్తుపిండి మంచి ప్రత్యామ్నాయంగా పనికొస్తుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook