Sesame Oil Benefits: పళ్లు సహజసిద్ధంగా మిళమిళా మెరవాలంటే..ఆ నూనెతో పుల్లింగ్ చేస్తే చాలు
Sesame Oil Benefits: ఆయిల్ పుల్లింగ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నోటికి సంబంధించిన పలు సమస్యల్నించి ఉపశమనం కోసం చేస్తుంటారు. అదే నువ్వుల నూనెతో పుల్లింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా మీకు..
Sesame Oil Benefits: ఆయిల్ పుల్లింగ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నోటికి సంబంధించిన పలు సమస్యల్నించి ఉపశమనం కోసం చేస్తుంటారు. అదే నువ్వుల నూనెతో పుల్లింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా మీకు..
చాలామందికి నోటి సమస్యలు అధికంగా ఉంటాయి. పంటి నొప్పులు, చిగుళ్ల నొప్పులు, నోటి దుర్వాసన, పళ్లు పసుపుగా ఉండటం వంటివి ప్రధాన సమస్యలు. కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ఇందుకు ప్రధానంగా ఉపయోగపడేది నువ్వుల నూనె. నువ్వుల నూనెతో పుల్లింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. నోటి సమస్యలు పోవడమే కాకుండా..పళ్లు మిళ మిళా మెరుస్తాయంటున్నారు దంత వైద్య నిపుణులు. నువ్వుల నూనెతో పుల్లింగ్ వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నువ్వుల నూనెతో పుల్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు
1. మీ పళ్లను సహజసిద్ధంగా తెల్లగా మెరిసేలా చేయాలంటే..నువ్వుల నూనెతో పుల్లింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. పళ్లలో పేరుకున్న పసుపు మచ్చల్ని తొలగించడమే కాకుండా మీ పళ్లను పటిష్టం చేస్తుంది.
2. నువ్వుల నూనెతో పుల్లింగ్ చేయడం వల్ల పళ్ల పసుపు మచ్చలు పోతాయి. అంతేకాకుండా పళ్లకు సంబంధించి ప్రధానంగా ఎదురయ్యే కేవిటీ సమస్య దూరమౌతుంది.
3. నువ్వుల నూనెతో పుల్లింగ్ చేయడం వల్ల పళ్లు పటిష్టంగా మారడమే కాకుండా..పళ్లు లేదా దంతాలు త్వరగా ఊడకుండా ఉంటాయి.
4. మీ చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే..లేదా చిగుళ్లకు సంబంధించిన సమస్యలుంటే నువ్వుల నూనెతో పుల్లింగ్ ఆశించిన ప్రయోజనాల్ని కల్గిస్తుంది.
5. మీకు తరచూ తలనొప్పి, మైగ్రెయిన్ సమస్యలుంటే..లేదా ఆస్తమాతో పీడితులుగా ఉంటే నువ్వుల నూనెతో క్రమం తప్పకుండా ఉదయం వేళ పుల్లింగ్ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
6. నోటి దుర్వాసనతో బయట నలుగురిలో మాట్లాడేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నువ్వుల నూనెతో పుల్లింగ్ చేయడం ద్వారా నోటి దుర్వాసన పోతుంది.
Also read: Honey Health Benefits: రోజూ ఉదయం వేళ అది తాగితే చాలు..కొవ్వు వేగంగా కరుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook