Cold Drink: అతిగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!
Side Effects of Drinking Cold Drinks: క్రమం తప్పకుండా శీతల పానీయాలు తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు. అది నిజమే అందులో ఉండే చక్కెర పరిమాణాలు శరీర బరువును పెంచడమేకాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
Side Effects of Drinking Cold Drinks: క్రమం తప్పకుండా శీతల పానీయాలు తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు. అది నిజమే అందులో ఉండే చక్కెర పరిమాణాలు శరీర బరువును పెంచడమేకాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా స్థూలకాయం వంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది. అయితే ఇది చాలా మందిలో ప్రాణాంతకంగా కూడా మారుతుంది. బరువు పెరగడానికి ఆరోగ్యమైన ఆహారాలను తీసుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వీటి దుష్ప్రభావాలు:
మధుమేహం రావొచ్చు:
అతిగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చాలా మందిలో టైప్ 2 డయాబెటిస్‌కు కారణమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
గుండె జబ్బులు:
చక్కెరతో కూడిన శీతల పానీయాలు కొందరిలో గుండె సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. కూల్ డ్రింక్‌లో హానికరమైన రసాయనాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని నియంత్రిస్తుంది.
బరువు పెరగడం:
శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల సులభంగా బరువు పెరుగుతారని నిపుణుతు తెలుపుతున్నారు. ముఖ్యంగా సోడా డ్రింక్‌లో చాలా రకాల హానికరమైన పదార్థాలుంటాయి. కావున వీటిని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.
దంతాలు చెడిపోతాయి:
శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల బయటి పొర దెబ్బతింటుంది. అయితే పిల్లల్లో అయితే దంతాలలో క్యావిటీ సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. కొంతమందిలో దంతాలు విరిగిపోవడానికి కూడా కారణమవుతుంది. కావున వీటిని తీసుకోవడం మంచిదికాదని నిపుణులు తెలుపుతున్నారు.
శరీరంపై ప్రభావం:
ప్రస్తుతం చాలా మంది శీతల పానీయాలను విచ్చల విడిగా తాగుతున్నారు. అయితే వీటిని అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరిగితే.. శరీరంపై వివిధ రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook