Side Effects of Using More AC: బయట ఉన్న ఎండ వేడితో వచ్చే సమస్యల కంటే ఎక్కువ సమయం ఏసీలో ఉండటం వల్ల వచ్చే సమస్యలే అధికం అని అధ్యయనాలు చెబుతున్నాయంటున్నారు. అలా వచ్చే ఆరోగ్య సమస్యనే సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అని అంటారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారికైనా సరే.. ఎక్కువ చల్లదనంతో ఏసీలో ఉన్నట్టయితే.. వారి ఆరోగ్యంపై ఏసీ వినియోగం దుష్ర్పభావమే ఎక్కువగా ఉంటుంది. వారి శ్వాసకోశాలలో మార్పులు చోటుచేసుకుని ఆస్తమా లాంటి జబ్బులు ఎటాక్ అవుతాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా ఎక్కువ సమయం ఏసీలో గడపడం వల్ల కలిగే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే..
ఎక్కువ సమయం చల్లటి గాలికి ఎక్స్ పోజర్ అవడం వల్ల బ్రాంచియల్ ఇన్ ఫ్లమేషన్ అనే సమస్య తలెత్తుతుంది. ఇది అనేక ఇతర జబ్బులకు మూల కారణం అవుతుంది.


కళ్లు పొడిగా మారడం :
సాధారణంగా ఏసీ వాతావరణంలో గాలిలో తేమ అనేదే ఉండదు. కానీ కళ్లకు తేమ లాంటి వాతావరణం అవసరం. ఏసీ ఉన్న గదిలో మాయిశ్చర్ లేకపోవడం వల్ల కళ్లలోనూ మాయిశ్చర్ కనుమరుగై కళ్లు పొజిబారిపోతాయి. ఫలితంగా కళ్లలో మంటగా, దురదగా అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు దృష్టి మసకబారడం జరుగుతుంది. 


భరించలేని తలనొప్పి :
ఎక్కువ సమయం ఏసీలో గడపడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల్లో తలనొప్పి కూడా ఒకటి. కొంతమందికి మైగ్రేన్ పెయిన్ కూడా వస్తుంది. ఆనల్స్ ఆఫ్ ఇండియన్ అకాడమి ఆఫ్ న్యూరాలజీ సంస్థ వారు జరిపిన అధ్యయనం ప్రకారం ఆరోగ్యకరమైన వాతావరణం లేని ఇండోర్ ఆఫీసులో పనిచేయడం వల్ల నెలకు 1 నుంచి 3 రోజులు తలనొప్పి రావడం జరుగుతుందని తేలింది. అలాగే 8 శాతం మంది రోజూ తలనొప్పి వస్తున్నట్టు ఈ అధ్యయనంలో స్పష్టమైంది. 


ఎలర్జీ సమస్యలు :
ఎయిర్ కండిషనర్ నుంచి వెలువడే చల్లటి గాలి మైక్రోబయల్ ఎలర్జెన్స్ కి నివాసంగా మారుతుంది. ఫలితంగా కళ్లు, ముక్కు, గొంతులో దురద రావడం, పదే పదే తుమ్ములు రావడం, తొలనొప్పి రావడం, టాన్సిల్స్, సైనస్ సమస్యలు తలెత్తడం, ఒంటి నొప్పులు రావడం జరుగుతుంది. 


తీవ్రమైన డీహైడ్రేషన్ :
ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా.. ఏసీ గదుల్లో మాయిశ్చర్ అనేదే ఉండదు. గాలిలో ఉన్న మాయిశ్చర్ ని ఎయిర్ కండిషనర్స్ పూర్తిగా పీల్చేస్తాయి. అలాగే అక్కడున్న వారి శరీరంలోనూ తేమ అనేదే లేకుండా అవుతుంది. అలా డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఈ డైహైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, కిడ్నీలు దెబ్బ తినడం, హార్ట్ స్ట్రోక్ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 


విపరీతమైన అలసట :
ఏసీలో ఉన్న వారికి సాధారణంగా అలసట రాదు అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ అది వాస్తవం కాదు. ఎక్కువ సమయం ఏసీలో గడిపే వారు త్వరగా అలసిపోవడం, కళ్లు తిరగడం వంటి సమస్యలు కనిపించినట్టు అనేక అధ్యయనాల్లో తేలింది. అలాగే జలుబు, దగ్గు లాంటి ఫ్లూ బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువే.