Skin Care Tips: రోజూ అందంగా, మెరుస్తూ కన్పించాలంటే..ఇది రాయండి చాలు
Skin Care Tips: ఆరోగ్యం ఎంత ముఖ్యమో చర్మ సంరక్షణ కూడా అంతే అవసరం. ఉదయం లేవగానే ముఖ సంరక్షణ ఉంటే రోజంతా హాయిగా..ప్రశాంతంగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Skin Care Tips: ఆరోగ్యం ఎంత ముఖ్యమో చర్మ సంరక్షణ కూడా అంతే అవసరం. ఉదయం లేవగానే ముఖ సంరక్షణ ఉంటే రోజంతా హాయిగా..ప్రశాంతంగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ హెల్తీగా ఉండాలి. అలా ఉంటేనే రోజంతా మెరుగైన ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్ ఉంటుంది. ఆరోగ్యంపై ఎలా శ్రద్ధ పెడతామో..అలానే చర్మ సంరక్షణ కూడా ఉండాలి. ఉదయం లేవగానే ముఖ సంరక్షణ ఉంటే రోజంతా ఫ్రెష్‌గా, అందంగా కన్పిస్తారు. రోజూ ఎంత బిజీగా ఉన్నా..ఓ 10 నిమిషాలు మీ ముఖ సంరక్షణ లేదా ముఖ అందం కోసం కేటాయించాలి. మీ ముఖానికి రోజూ ఆ పదార్ధంరాస్తే..రోజంతా హైడ్రేట్‌గా ఉంటుంది. స్కిన్ కేర్ ఎలా ఉండాలి, ముఖ అందం కోసం ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం లేవగానే ముందుగా మీ ముఖాన్ని క్లీన్సర్ సహాయంతో క్లీన్ చేయాలి. దీనివల్ల ముఖంపై పేరుకున్న వ్యర్ధాలు, డెడ్‌స్కిన్, ధూళి తొలగిపోతాయి. దాంతోపాటు ఫ్రెష్‌నెస్ కలుగుతుంది. మీ స్కిన్‌ను బట్టి క్లీన్సర్ ఎంచుకోవాలి. మీ స్కిన్ సెన్సిటివ్ అయితే..క్యామిల్ ఫ్రీ క్లీన్సర్ మంచిది. స్కీన్ ఆయిలీ అయితే ఆయిల్ ఫ్రీ క్లీన్సర్ వాడాలి. ఉదయం లేవగానే క్లీన్సర్ తప్పకుండా వాడాలి.
పసుపు, చందనం అనేది అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలు. ఇవి ముఖానికి తక్షణం నిగారింపు ఇస్తాయి. ముఖానికి గ్లో వచ్చేందుకు పసుపు,చందనం ఫేస్‌ప్యాక్ అప్లై చేస్తుంటారు. దీనికోసం 2 చెంచాల చందనం పౌడర్ తీసుకుని కొద్దిగా పసుపు, గులాబీ ఆకులు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 20 నిమిషాలుంచాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల ముఖం మరింత అందంగా, నిగారింపుగా మారుతుంది.
చాలామంది రాత్రి వేళ సీరమ్ రాస్తుంటారు. కానీ ఉదయం వేళ కూడా సీరమ్ రాయడం చాలా మంచిది. అవసరం కూడా. ఉదయం వేళల్లో ముఖానికి సీరమ్ రాస్తే..చర్మ సురక్షితంగా ఉంటుంది.
Also read: Ajwain Benefits: వాముతో మధుమేహానికి చెక్, రోజూ ఇలా తీసుకోండి చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook