Natural Beauty Tips: అందం మనిషికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలకు అందం అనేది చాలా ముఖ్యం. మేకప్ లేకుండా సహజ సిద్ధమైన అందం కావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందంగా కన్పించాలనేది ప్రతి అమ్మాయి కల. అందుకే ఎక్కువ సేపు అలంకరణ, అందానికి మెరుగులు దిద్దుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. దీనికోసం మార్కెట్‌లో లభించే వివిధ మేకప్ సామగ్రిని వినియోగిస్తుంటారు. ఫలితంగా చర్మానికి కచ్చితంగా హాని కలుగుతుంది. మరి సహజ సిద్ధమైన అందం కోసం ఏం చేయాలనేదే ప్రశ్న. సహజమైన నిగారింపు, అందం ఉంటే ఏ విధమైన మేకప్ అవసరం లేదు. చర్మాన్ని కాంతివంతంగా, అందంగా తీర్చిదిద్దేందుకు కొన్ని మార్గాలు లేకపోలేదు. ఆ టిప్స్, ఆ మార్గాలేంటో చూద్దాం..


మేకప్ లేకుండా కూడా అందాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. దీనికోసం ముందుగా చేయాల్సింది చర్మాన్ని శుభ్రంగా ఉంచడం. స్కిన్ శుభ్రంగా ఉంటే మేకప్ లేకుండానే ఆకర్షణీయంగా కన్పిస్తారు. దీనికోసం మైల్డ్ క్లీన్సర్,ఫేస్‌వాష్ వాడాలి. ఎప్పుడు బయట్నించి వచ్చినా..ముందుగా ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే ముఖంపై పింపుల్స్ సమస్య అధికమౌతుంది. 


మేకప్ లేకుండా అందంగా కన్పించాలంటే మంచి స్కిన్ కేర్ రూటీన్ ఫాలో చేయాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత టోనర్ అప్లై చేయాలి. టోనర్ తరువాత సీరమ్ రాయాలి. ఆ తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, రాత్రి చేస్తుండాలి. అటు చేతులు, కాళ్లకు లోషన్ అప్లై చేయాలి. డెడ్ స్కిన్ కారణంగా చర్మం ముడతలు పడుతుంది. ఈ పరిస్థితుల్లో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు వారంలో ఓసారి మెనిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్ తప్పనిసరి.


గుర్తుంచుకోవల్సిన అంశాలు


ఆరోగ్యమైన చర్మం కోసం సరైన నిద్ర చాలా అవసరం. నిద్ర సరిపోకపోతే డార్క్ సర్కిల్స్ సమస్య ఏర్పడుతుంది. అదే సమయంలో స్కిన్ వాచినట్టు కన్పిస్తుంది. అందుకే ప్రతిరోజూ మంచి నిద్ర అనేది చాలా అవసరం. చర్మం ఆరోగ్యంగా ఉంచేందుకు ఎక్కువ నీరు తాగాలి. 


Also read: Jamun Benefits: నేరేడు పండ్లు ఇలా తీసుకుంటే...కొద్ది వారాల్లోనే బరువు తగ్గడం ఖాయం



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook