Brinjal For Skin Care:  ప్రస్తుత రోజుల్లో ముఖం మీద మెుటిమలు (Pimples) లేదా మచ్చలు రావడమనేది సర్వసాధారణమైపోయింది.  మారిన జీవనశైలి, చెడు ఆలవాట్లు, తదితర కారణాల వల్ల ఫేస్ పై మెుటిమలు వస్తున్నాయి. వీటిని తొలగించడానికి భారీగా ఖర్చు చేయనవసరం లేదు. ఈ ఇంటి చిట్కాతో సులభంగా వీటికి చెక్ పెట్టవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వంకాయ ముఖానికి ఎలా ఉపయోగపడుతుంది?
సాధారణంగా మనం వంకాయను (Brinjal) కూర చేయడానికి ఉపయోగిస్తాం. అయితే వంకాయలు కూడా ముఖ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయని మీకు తెలుసా. మీరు వంకాయను వివిధ మార్గాల్లో ఉపయోగిస్తే, ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. 


1. సన్ బర్న్ నివారించడం
వేసవిలో అధిక సూర్యకాంతి, వేడి గాలుల కారణంగా.. వడదెబ్బ, చర్మం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటప్పుడు వంకాయ జ్యూస్ తాగితే మీ సమస్యలను తొలగిస్తుంది. ఈ జ్యూస్‌లో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇది చర్మపు చికాకును తొలగించడానికి పనిచేస్తుంది.


2. ముఖం మృదువుగా మారుతుంది
కాలుష్యం ముఖంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది చర్మాన్ని పొడిబారి నిర్జీవంగా మార్చుతుంది. వంకాయలో 90% కంటే ఎక్కువ పరిమాణంలో నీరు ఉన్నందున, ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది ముఖాన్ని మృదువుగా చేస్తుంది. 


3. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది
వృద్ధాప్యం యొక్క ప్రభావాన్ని ఆపడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో, మీరు వంకాయ యొక్క ఫేస్ మాస్క్‌ను సిద్ధం చేయవచ్చు. ఈ కూరగాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. ఈ ఫేస్ మాస్క్ ముఖం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది మరియు అద్భుతమైన గ్లో కూడా తెస్తుంది. అలాగే, ఇది మచ్చలను కూడా తొలగిస్తుంది.


Also Read: Weight loss Tips: ఇంటిలో లభించే వాటిలో బరువును తగ్గించుకోండి..అది ఎలానో తెలుసుకోండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.