Skin Care Tips: నిత్య యౌవనంగా, అందంగా కన్పించాలంటే ఏం చేయాలి
Skin Care Tips: మనిషికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో చర్మ సంరక్షణ కూడా అంతే అవసరం. చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే చర్మ సంరక్షణ చాలా సులభమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం..
Skin Care Tips: ఇటీవలి కాలంలో చర్మ సంబంధిత సమస్యలు, స్కిన్ ఎలర్జీ వంటివి చాలా ఎక్కువగా కన్పిస్తున్నాయి. చర్మాన్ని పరిరక్షించేందుకు, మృదువుగా మార్చేందుకు గ్లిసరిన్ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. గ్లిసరిన్‌తో కలిగే ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం..
ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవన శైలి, కాలుష్యం కారణంగా చర్మ సమస్యలు అధికమౌతున్నాయి. ఈ క్రమంలో చర్మాన్నిసంరక్షించుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఆయిలీ స్కిన్ సమస్య ఉన్నవారు చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పింపుల్స్, యాక్నే, డార్క్ స్పాట్స్ వంటివి అందాన్ని దెబ్బతీస్తాయి. అయితే మార్కెట్‌లో లభించే వివిధ రకాల కెమికల్ ఆధారిత క్రీములు వినియోగించకుండా కేవలం గ్లిసరిన్ సహాయంతో ఈ సమస్యకు పరిష్కారం పొందవచ్చు. గ్లిసరిన్ ఏయే రకాలుగా ఉపయోగించవచ్చు, కలిగే లాభాలేంటో చూద్దాం.
గాయాలు త్వరగా మానేందుకు, ఇన్‌ఫెక్షన్ తగ్గించేందుకు గ్లిసరిన్ ఉపయోగిస్తారు. స్వెల్లింగ్, బ్యాక్టీరియా ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. చాలామందికి డ్రై స్కిన్ సమస్య ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లు గ్లిసరిన్ ఉపయోగించడం వల్ల చర్మానికి తేమ లభిస్తుంది. వారంలో మూడు సార్లు రోజ్ వాటర్‌లో గ్లిసరిన్ కలుపుకుని అప్లై చేసుకోవాలి.
అన్నింటికీ మించి గ్లిసరిన్‌లో యాంటీ ఏజీయింగ్ గుణాలు చాలా ఎక్కువ. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నియంత్రిస్తాయి. చర్మంలో తేమలోటును తీరుస్తుంది. చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాల్ని అందిస్తుంది. దాంతో చర్మం వదులుగా ఉండటం, వృద్ధాఫ్య లక్షణాలు దూరమౌతాయి. గ్లిసరిన్ అనేది ప్లాంట్ ఆధారిత ఉత్పత్తి. అందుకే గ్లిసరిన్ ఉపయోగించడం వల్ల చర్మం ఇరిటేషన్, ర్యాషెస్, దురద వంటి చాలా సమస్యలు దూరమౌతాయి. దాంతోపాటు దెబ్బతిన్న చర్మం సెట్ అయ్యేందుకు గ్లిసరిన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Also read: Diabetes Diet: మధుమేహహం వ్యాధిగ్రస్థులకు వెజ్, నాజ్ వెజ్‌లో ఏది మంచిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook