Skin Care Tips: కివీ ఫేస్‌ప్యాక్ గురించి తెలుసా, మీ అందం రెట్టింపు, చర్మ సమస్యలు దూరం
Skin Care Tips: కివీ ఫ్రూట్. పోషకాల్లో అత్యంత ముఖ్యమైంది. ఆరోగ్యం కోసమే చాలామంది తింటుంటారు. కానీ కివీ చర్మ ఆరోగ్యానికి , ముఖ వర్ఛస్సుకు మంచిదని చాలామందికి తెలియదు. కివీ ఫేస్‌ప్యాక్ ముఖానికి రాసుకుంటే రెట్టింపు అందం మీ సొంతమౌతుంది.
కివీ ఫ్రూట్‌లో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కివీ ఫ్రూట్ వల్ల చాలా లాభాలున్నాయి. కేవలం అంతర్గత ఆరోగ్యానికే కాకుండా బాహ్య అందానికి, చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. అదెలాగో చూద్దాం.
కివీ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యల్ని దూరం చేయడంలో దోహదం చేస్తాయి. కివీ వాడటం వల్ల ముఖంపై ఏర్పడే పింపుల్స్, ర్యాషెస్, డార్క్ సర్కిల్స్ వంటి చర్మ సమస్యలన్నీ చిటికెలో దూరమౌతాయి. కివీ ఫ్రూట్‌తో ఫేస్‌ప్యాక్ చేసుకుని ముఖానికి రాసుకుంటే రెట్టింపు అందం మీ సొంతమౌతుంది.
చందనం పౌడర్‌తో కలిపి
కివీ ఫ్రూట్‌ను చందనంతో కలిపి పేస్ట్ చేయాలి. కివీ ఫ్రూట్‌ను మిక్సీ చేసి చందనం పౌడర్ కలిపి మిశ్రమంగా మార్చాలి. ఫేస్‌ప్యాక్ వారానికి 2-3 సార్లు రాస్తే ముఖం చాలా అందంగా నిగనిగలాడుతుంది.
ఆలివ్ ఆయిల్‌తో కలిపి
కివీ ఫ్రూట్‌ని ఆలివ్ ఆయిల్‌తో కలిపి రాయడం వల్ల చర్మానికి చాలా లాభదాయకం. కివీ ఫ్రూట్‌ని ముక్కలుగా కోసి ఆలివ్ ఆయిల్ కలిపి మిక్సీ చేయాలి. కివీ, ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని 15 నిమిషాలు వదిలేయాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
కివీతో పెరుగు
కివీతో కలిపి పసుపు, తేనె కలిపి ఫేస్‌ప్యాక్ తయారు చేసుకోవాలి. ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు కివీ మిక్సీ చేయాలి. అందులో పసుపు, పెరుగు, తేనె కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ముఖానికి రాసుకుని 15 నిమిషాలు ఉంచాలి.
చర్మానికి నిగారింపు
కివీ ఫ్రూట్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి తేమను అందిస్తాయి. చర్మాన్ని లోపల్నించి మాయిశ్చరైజ్ చేసి నిగారింపును ఇస్తాయి.
పింపుల్స్ దూరం
కివీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పింపుల్స్ దూరం చేస్తాయి. కివీ ఫేస్‌ప్యాక్ రాయడం వల్ల ముఖంపై పింపుల్స్, యాక్నే వంటి సమస్యలు దూరమౌతాయి.
డెడ్‌స్కిన్ విముక్తి
కివీని డెడ్‌స్కిన్ దూరం చేసేందుకు వినియోగిస్తారు. కివీ ఫేస్‌ప్యాక్ రాయడం వల్ల డెడ్‌స్కిన్ పోతుంది. స్కిన్ సెల్స్ తెర్చుకుని ట్యానింగ్ సమస్య కూడా తొలగిపోతుంది.
డార్క్ సర్కిల్స్ దూరం
డార్క్ సర్కిల్స్ దూరం చేయడంలో కివీ ఫ్రూట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. కివీ ఫేస్‌ప్యాక్ రాయడం వల్ల డార్క్ సర్కిల్స్ దూరమౌతాయి.
ముడతలు దూరం
కివీలో ఉండే పోషకాలతో చర్మంపై ముడతలు దూరమౌతాయి. కివీ ఫ్రూట్ ఫేస్‌ప్యాక్ రాయడం వల్ల ఏజీయింగ్ సమస్య దూరమౌతుంది.
Also read: Home Remedies: చలికాలం సమస్యల్నించి దూరంగా ఉండాలంటే..ఈ ఐదు రకాల పదార్ధాలకు దూరం పాటించాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook