Home Remedies: చలికాలం సమస్యల్నించి దూరంగా ఉండాలంటే..ఈ ఐదు రకాల పదార్ధాలకు దూరం పాటించాల్సిందే

చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలు అధికంగా ఉంటాయి. వాతావరణం ఒక్కటే కాకుండా ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. కొన్నిరకాల ఆహార పదార్ధాల వల్ల ఈ సమస్యలు ఎక్కువౌతాయి. ఇమ్యూనిటీ బలహీనమౌతుంది. వ్యాధులతో పోరాడే సామర్ధ్యం తగ్గుతుంది. అందుకే కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.

Home Remedies: చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలు అధికంగా ఉంటాయి. వాతావరణం ఒక్కటే కాకుండా ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. కొన్నిరకాల ఆహార పదార్ధాల వల్ల ఈ సమస్యలు ఎక్కువౌతాయి. ఇమ్యూనిటీ బలహీనమౌతుంది. వ్యాధులతో పోరాడే సామర్ధ్యం తగ్గుతుంది. అందుకే కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.

1 /5

టీ, కాఫీలో ఉండే కెఫీన్ కారణంగా దగ్గు పెరుగుతుంది. గొంతు ఎండిపోతుంటుంది. దగ్గు ఉన్నప్పుడు టీ, కాఫీలు తాగకూడదు. 

2 /5

బియ్యం స్వభావం చలవ చేసేదిగా ఉంటుంది. చలికాలంలో అన్నం తినడం తగ్గించాలి. అన్నం తినడం వల్ల కఫం సమస్య పెరిగిపోతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.

3 /5

ఫ్రైడ్ పదార్ధాలకు దూరంగా ఉండాలి. లేకపోతే దగ్గు, జలుబు సమస్య పెరుగుతుంది. ప్రోసెస్డ్ పదార్ధాలు ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. వ్యాధుల్ని పెంచుతాయి. 

4 /5

డైరీ ఉత్పత్తులు తినడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు పెరుగుతాయి. పాలతో తయారయ్యే వస్తువులతో కఫం పెరుగుతుంది. జలుబు, దగ్గు ఉంటే నెయ్యి, పెరుగు వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి.

5 /5

కోల్డ్ పదార్ధాలు చలికాలంలో కోల్డ్ పదార్ధాలు తినకూడదు. ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచిన పదార్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. కొన్ని వస్తువుల స్వభావం చలవ చేస్తుంది. దోసకాయ, టొమాట వంటి పదార్ధాలు ఫ్రిజ్‌లో ఉంచి తినకూడదు. ఐస్‌క్రీమ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.