Skin Care Tips: శెనగపిండితో ఇలా చేస్తే..15 రోజుల్లోనే అందమైన ముఖం మీ సొంతం
Skin Care Tips: మెరుగైన ఆరోగ్యమే కాదు..అందమైన ముఖం కూడా అవసరం. ఎందుకంటే అందం సగం ఆరోగ్యంతో సమానం. మరి అందమైన ముఖానికి ఏం చేయాలి, ఎలాంటి చిట్కాలు పాటించాలి..
ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణ కోసం ఎన్నో పద్ధతులు అవలంభిస్తుంటారు. స్కిన్ కేర్‌పై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే అందంగా ఉంటే సగం ఆరోగ్యం ఉంటుంది. అందం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం. కొన్ని రకాల చిట్కాలు ఇందుకు దోహదపడతాయి.
బేసన్ లేదా శెనగపిండి అనాదిగా చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యానికి ఓ సాధనంగా వాడుకలో ఉంది. శెనగపిండి అనేది గరుగ్గా ఉండటం వల్ల చర్మం లోతుల్లోకి చొచ్చుకెళ్లి శుభ్రం చేస్తుంది. స్కిన్ ఇన్‌ఫెక్షన్ సమస్య ఉంటే శెనగపిండి అద్భుతంగా పనిచేస్తుంది. శెనగపిండి లేదా బేసన్ అనేది చర్మానికి పోషకాలు అందించడమే కాకుండా..ఇన్‌ఫెక్షన్ దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అటు వర్షాకాలంలో చర్మం ఆయిలీగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో చర్మాన్ని శెనగపిండితో శుభ్రం చేస్తే..ఆయిలీ స్కిన్ సమస్య దూరమౌతుంది. ఆ చిట్కాలు మీ కోసం..
ముఖంపై శెనగపిండి రాయడం వల్ల కలిగే లాభాలు
ముఖంపై శెనగపిండి రాస్తే పింపుల్స్ సమస్య దూరమౌతుంది. శెనగపిండిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రం చేయడంలో ఉపయోగపడతాయి. ముఖంపై శెనగపిండి రాయడం వల్ల చర్మం లోపలి భాగం కూడా క్లీన్ అవుతుంది. ఫలితంగా పింపుల్స్ దూరమౌతాయి.
డెడ్ సెల్స్ తొలగించేందుకు
ముఖంపై బేసన్ రాయడం వల్ల ముఖం శుభ్రమౌతుంది. శెనగపిండిలో ఉండే యాక్సెఫోలేటింగ్ ఏజెంట్ చర్మంలోని డెడ్‌స్కిన్ భాగాన్ని తొలగించడంలో దోహదపడుతుంది. అదే విధంగా శెనగపిండి ఓ రకమైన సహజసిద్ధమైన బ్లీచ్‌లా పనిచేస్తుంది. దాంతో చర్మం రంగు కోల్పోదు. దీంతోపాటు రోజూ ముఖానికి రాస్తుంటే...ముఖం కాంతివంతమౌతుంది.
శెనగపిండి అనేది ముఖంపై ఉన్న అధిక ఆయిల్‌ను తొలగించి శుభ్రం చేస్తుంది. సహజపద్ధతిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శెనగపిండిని పగలు ఎప్పుడైనా రాయవచ్చు. దీనివల్ల చర్మం శుభ్రంగా, స్పష్టంగా మారుతుంది.
Also read: Cycling Precautions: సైక్లింగ్ అందరికీ మంచిది కాదా, ఎవరు సైక్లింగ్ చేయకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook