Cycling Precautions: సైక్లింగ్ అందరికీ మంచిది కాదా, ఎవరు సైక్లింగ్ చేయకూడదు

Cycling Precautions: ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ చాలా మంచిదని ప్రతి ఒక్కరికీ తెలుసు. బాడీ హెల్తీగా, ఫిట్‌గా ఉంటుంది సైక్లింగ్‌తో. కానీ కొంతమందికి మాత్రం సైక్లింగ్ ప్రమాదకరం. ఆశ్చర్యంగా ఉందా..నిజమే..ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 13, 2022, 11:09 PM IST
Cycling Precautions: సైక్లింగ్ అందరికీ మంచిది కాదా, ఎవరు సైక్లింగ్ చేయకూడదు

Cycling Precautions: ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు రోజూ చేసే వివిధ రకాల వ్యాయామ ప్రక్రియల్లో కీలకమైంది సైక్లింగ్. బాడీని పూర్తి ఫిట్‌గా ఉంచుతుంది. అందుకే వైద్యులు కూడా సైక్లింగ్ చేయమని సూచిస్తుంటారు. అదే సమయంలో కొంతమందికి సైక్లింగ్ లేని సమస్యలకు కారణమౌతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

మెరుగైన ఆరోగ్యం కోసం సరైన ఆహారంతో పాటు ఎక్సర్‌సైజ్ కూడా అవసరం. ఎక్సర్ సైజ్ వల్ల బాడీ మొత్తం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్లి ఎక్సర్ సైజ్ చేసే తీరిక లేనప్పుడు లేదా జిమ్ వర్కవుట్స్ ఇష్టం లేక..సైక్లింగ్ అలవాటు చేసుకుంటారు. నిస్సందేహంగా సైక్లింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. సైక్లింగ్ వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందంటారు. సైక్లింగ్ శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా..మానసిక ఆరోగ్యాన్ని కూడా కలగజేస్తుంది. మరి సైక్లింగ్ అందరికీ ప్రయోజనం కాదా అంటే కాదనే సమాధానం వస్తోంది. సైక్లింగ్ కొంతమందికి లేని సమస్యల్ని తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎవరు సైక్లింగ్ చేయకూడదో తెలుసుకుందాం..

సైక్లింగ్ లాభాలు

ప్రతిరోజూ క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దాంతోపాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా హార్ట్ స్ట్రోక్ ముప్పు తగ్గిపోతుంది. సైక్లింగ్ కారణంగా అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. బరువు తగ్గేందుకు సైక్లింగ్ మంచి మార్గం.

సైక్లింగ్ వల్ల మానసిక ఆరోగ్యం లభిస్తుంది. రోజూ సైక్లింగ్ చేస్తుంటే..ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల్ని జయించవచ్చు. సైక్లింగ్ కారణంగా హిప్పోక్యాంపస్ లో మజిల్స్ నిర్మాణంలో దోహదమౌతుంది. సైక్లింగ్ జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. 

సైక్లింగ్ ఎవరు చేయకూడదు

జాయింట్ పెయిన్స్ , కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవాళ్లు సైక్లింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఈ సమస్యలున్నవాళ్లు సైకిల్ తొక్కడం వల్ల సమస్య మరింత జటిలమౌతుంది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవాళ్లు ముఖ్యంగా ఆస్తమా, బ్రోంకైటిస్ వంటి పరిస్థితుల్లో సైకిల్ తొక్కకూడదు. సైక్లింగ్ సమయంలో బయట  గాలి పీలుస్తున్నప్పుడు గుండె వేగం పెరిగి ఆస్తమా ఎటాక్ కావచ్చు.

Also read: Batasha and Ghee: దేశీ నెయ్యిలో వీటిని కలుపుకుని తీసుకుంటే..అన్ని అనారోగ్య సమస్యలకు చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News