Skin Care Tips: ఆధునిక జీవన శైలి కారణంగా స్త్రీ , పురుషులు మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలకు ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో  వేడి తీవ్రత పెరిగి మొటిమల సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల చిట్కాలున్నాయి. ఇవి మీ చర్మాన్ని సంరక్షించడమే కాకుండా మంచి పోషకాలను అందిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవిలో ఈ విధంగా చర్మాన్ని సంరక్షించుకోండి:


మొటిమలను ఇలా చేయోద్దు:


ముఖంపై మొటిమలు ఉన్నప్పుడు వాటిని వీలైనంత త్వరగా వదిలించుకోవాలని అనుకుంటారు. అటువంటి పరిస్థితిలో.. చాలాసార్లు మొటిమలను పగలగొట్టుకుంటారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మొటిమను పగలగొట్టడం వల్ల మంట, దురద వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చర్మంపై మరకలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.


పుష్కలంగా నీరు తాగండి:


చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తాగడం చాలా ముఖ్యం. ముఖంపై మొటిమలు ఉంటే.. తగినంత నీరు త్రాగటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వచ్చి.. ముఖంపై మెరుపు వస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.


వ్యాయామం తర్వాత ముఖం తుడుచుకోండి:


చాలా మంది వర్కవుట్ చేసిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం వల్లే.. మొటిమలకు దారి తీస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. వర్కవుట్ తర్వాత ముఖాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. లేక పోతే ముఖం మీద చెమటను తుడుచుకోవాలి.


ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి:


మొటిమల నుంచి ఉపశమనం పొందడానికి ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి. ఉదయం నిద్ర లేచిన తరువాత ఒక్కసారి.. రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి.. ఇలా రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: High Cholesterol: జీడి పప్పు తినడం వల్ల నిజంగానే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా..!


Also Read: International Yoga Day 2022: రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి.. ఈ 5 యోగాసనాలు చేస్తే చాలు!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook