Doing These 5 yogasanas for boost immunity and reduce stress: ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది. అందుకే ప్రతిఒక్కరు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అనారోగ్యానికి గురికాకూండా ఉండాలంటే.. మీరు మీ రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరును బలోపేతం చేయాలి. 'యోగా' చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని చాలా మందికి తెలియదు. అలాంటి యోగాను ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో చేయవచ్చు. యోగా చాపను పరిచి ఆసనాలు, ప్రాణాయామం లేదా ధ్యానం చేస్తే.. మెరుగైన రోగనిరోధక శక్తి మీ సొంతం అవుతుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొంటారు. 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏడాది జూన్ 21న యోగా దినోత్సవంను జరుపుకుంటున్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల ఓ కారణం ఉంది. అదేంటంటే.. జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. అంతేకాదు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవంను మరో ఐదు రోజుల్లో జరుపుకోనున్న నేపథ్యంలో టాప్ 5 యోగాసనాలను ఓసారి చూద్దాం.
శలభాసనం:
బోర్లా పడుకొని రెండు కాళ్ళను దగ్గరగా రెండు చేతులను తొడల క్రింద ఉంచాలి. గదవ నేలపై ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి మొదట కుడికాలును మోకాలు వంచకుండా పైకి ఎత్తాలి. ఈ స్థితిలో కొన్ని క్షణాలున్న తర్వాత మెల్లగా కాలు నేలపై ఆనించాలి. ఇదే విధంగా ఎడమకాలితో చేయాలి. మూడేసి సార్లు ఒక్కొక్క కాలితో చేసిన తర్వాత, రెండు కాళ్ళను కలిపి ఒకేసారి పైకి ఎత్తి కొద్ది క్షణాలు ఆగాలి. తర్వాత మెల్లగా క్రిందికి దించాలి. ఈ రకంగా మూడుసార్లు చేయాలి. ఇలా చేస్తే.. ప్రేగులలో రక్త ప్రసరణ జరగడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తడసానా (పర్వత భంగిమ):
చేతులు పైకి ఎత్తి నిటారుగా నిలబడాలి. మడమలు పైకెత్తి మునికాళ్లపై సాధ్యమైనంత సేపు నిలబబడాలి. మరల చేతులు మడమలు క్రిందికి దింపాలి. శరీరమందలి నరాల గుంజుడు, బిగింపుపై ధ్యానం కేంద్రీకరించాలి. రెండు మూడు పర్యాయాలు ఇలా చేసిన తరువాత సామాన్య శ్వాసతో తడసానా వేసూ మోకాళ్లు వంగకుండా వునికాళ్లతో చిన్న చిన్న అడుగులు వేసూ ముందుకు సాగాలి. ఈ ప్రాథమిక భంగిమ దాదాపు అన్ని భంగిమలకు పునాది మరియు కాళ్ళ నుండి చేతుల వరకు దాదాపు అన్ని భాగాల నాడీ వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి అత్యంత సమర్థవంతమైన యోగా ఆసనాలలో ఒకటి.
ఆంజనేయాసనం:
వెన్నెముక కదలికకు, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి రివాల్వింగ్ క్రెసెంట్ ఆసనం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీని వల్ల బరువు త్వరగా తగ్గుతారు. రెగ్యులర్‌గా ఈ ఆసనం చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. బాడీ కూడా ఫిట్‌గా ఉంటుంది. ఇందుకోసం ముందుగా పాదాలపై కూర్చుని.. ఎడమ కాలిని వెనక్కి చాపాలి. ఆపై రెండు చేతులను పైకెత్తి నమస్కారం చేసేటప్పుడు ఎలా చేతులను జోడిస్తామో అలా పెట్టి..ఆకాశం వైపు చూడాలి.
ధనురాసనం:
ఈ ఆసనం శరీరానికంతటికి శక్తి, బలాన్ని ఇస్తుంది. శరీర అంతర్భాగాలకు బలం చేకూరుతుంది. మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థ ఉత్తేజమవుతాయి. చదునైన నేలపై బోర్లా పడుకుని తల, మెడ, ఛాతి, తొడలు, మోకాళ్లను ఒకేసారి వెనక్కి లేపాలి. మోకాళ్లు, పాదాలు దగ్గరగా ఉంచి పైకి చూడాలి. శరీరమంతా నాభిపై సమతుల్యంగా ఉండేలా చేస్తూ నెమ్మదిగా చేతులతో కాలి బొటన వేళ్లను లాగుతూ శరీరాన్ని విల్లు రూపంలోకి తీసుకురావాలి. ఈ దశలో కనీసం 5 సెకన్ల పాటు గాలి పీల్చుతూ అలాగే ఉండాలి.
కుర్చీ ఆసనం:
ఈ ఆసనాన్ని కుర్చీలో కూర్చున్నట్లు చేయాలి. మీ రెండు కాళ్ళని దగ్గిరకి వంచి వెనుకకు, వీలైనంత తక్కువగా కుర్చీలో కూర్చునట్లు వంగాలి. మీ రెండు చేతులను ఆకాశం వైపుకు ఎత్తాలి. ఇది కాస్తా కష్టంగా ఉంటుంది. అయితే, మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, శరీరం ఫిట్ గా ఉండటానికి ఆసనాలు సాయపడతాయి.
Also Read: Horoscope Today June 16th : నేటి రాశి ఫలాలు.. ఈ 6 రాశుల వారు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు..
Also Read: Choreographer Trinath Rao: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook