COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Skin Care Tips: ముఖం అందంగా కాంతివంతంగా కనిపించేందుకు చాలామంది ప్రస్తుతం మార్కెట్లో లభించే ఖరీదైన సౌందర్య సాధనాలను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. దీనికి కారణంగా మరింత అందహీనంగా తయారవుతోంది. మరి కొంతమందిలో చర్మం పొడిబారడం నల్లగా తయారవ్వడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా చర్మాన్ని ఇప్పుడున్న నిగారింపు కంటే రెట్టింపు నిగారింపు పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 



ఫేషియ‌ల్స్, ఫేస్ వాష్, క్రీములు లేకుండా ముఖాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. తరచుగా వినియోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ కి బదులు ప్రతిరోజు దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ముఖం పై ఉన్న మచ్చలు మొటిమలు కూడా సులభంగా తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ముఖం నల్లగా ఉన్నవారు ప్రతిరోజు తేనెను అప్లై చేసి మర్దన చేయడం వల్ల నిగారింపైన చర్మాన్ని పొందుతారు.


దీంతోపాటు ముఖానికి పసుపును అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తేనె, పసుపును రెండింటిని మిక్స్ చేసి ముఖానికి పట్టించి మర్దన చేయడం వల్ల ముఖంపై చర్మం బంగారు రంగులోకి మారుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ముఖాన్ని ఎంతో కాంతివంతంగా తయారు చేసేది కూడా సహాయపడతాయి.


Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..


తరచుగా మొటిమలు మచ్చలు వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ముఖానికి పసుపు తేనెను అప్లై చేసి.. రెండు నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసిన తర్వాత 15 నిమిషాల పాటు ఆరనిచ్చి.. చల్లని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ముఖంపై మచ్చలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా కాంతివంతంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.


Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter