Ice Therapy: అందమైన ముఖం..నిగనిగలాడే చర్మం అందరూ కోరుకుంటారు. కొన్ని సూచనలు, చిట్కాలు పాటిస్తే కచ్చితంగా సాధ్యమౌతుంది. అదే సమయంలో చర్మ సంబంధిత సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృదువైన, నిగనిగలాడే చర్మం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కొంతమందైతే మార్కెట్‌లో లభించే విలువైన ఉత్పత్తుల్ని కూడా వినియోగిస్తుంటారు. అయినా ఆశించిన ప్రయోజనాలు లభించవు. కానీ సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే మీరు కోరుకున్న అందమైన ముఖ వర్ఛస్సు, నిగనిగలాడే చర్మం మీ సొంతమౌతుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. కేవలం ఐస్ ముక్కలతోనే మీరు కోరుకున్నది సాధించవచ్చు. క్రమం తప్పకుండా ఐస్ ముక్కలు ముఖానికి రాస్తుంటే..చర్మ సంబంధిత సమస్యలు దూరమౌతాయి. అంతేకాదు ఏజీయింగ్ లక్షణాలు కూడా దూరమౌతాయి. చర్మం కాంతివంతమౌతుంది. అయితే ఐస్ ముక్కల్ని ముఖానికి ఎలా రాయాలి, సరైన పద్ధతేంటో తెలుసుకుందాం..


ముఖానికి ఐస్ ముక్కలు రాయడం వల్ల ముఖం టైట్‌గా, ఫిట్‌గా ఉంటుంది.చర్మంపై పెద్దసైజులో ఉన్న రంధ్రాలు తగ్గుతాయి. దాంతోపాటు ముడతలు, ఫైన్ లైన్స్ కూడా తగ్గుతాయి. మీరు యవ్వనంగా కన్పిస్తారు. ముఖంపై ఐస్ ముక్కలు క్రమం తప్పకుండా రాస్తుండటం వల్ల చర్మంలో రక్త ప్రసరణ మెరుగౌతుంది. దాంతోపాటు చర్మపు అలసట తొలగిపోతుంది. అంటే చర్మం నిగారింపు వస్తుంది. ముఖానికి ఇన్‌స్టంట్ గ్లో లభిస్తుంది. 


సాధారణంగా ఎండల్లో, కాలుష్యంలో ఎక్కువ సమయం గడుపుతుంటాం. దీనివల్ల చర్మ మంట పుట్టడం వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. చర్మం ఎర్రగా మారిపోతుంటుంది. చర్మం మండుతున్నప్పుడు ఐస్ రాయడం మంచి విధానం. ఐస్ రాయడం వల్ల చర్మానికి కూలింగ్ చేరుతుంది. ఐస్ అనేది చర్మంపై ఉండే ఆయిల్‌ను శుభ్రం చేసేందుకు లేదా దూరం చేసేందుకు దోహదపడుతుంది.పెద్ద సైజులో ఉండే రంధ్రాల్ని చిన్నవిగా చేస్తాయి. ఫలితంగా పింపుల్స్ తగ్గుతాయి. చర్మంపై ముందు నుంచే ఉన్న పింపుల్స్ వాపు తగ్గుతాయి. దాంతోపాటు కొత్తగా పింపుల్స్ రాకుండా చేస్తాయి.


Also read: Diabetes Control Tips: షుగర్ పేషెంట్స్‌ బెల్లం టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook