COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Skincare With Rose Water: మారుతున్న జీవినశైలి కారణంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి రోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జిడ్డు చర్మం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి, హార్మోన్ల సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా మొటిమల సమస్యలు వస్తున్నాయి. మొటిమల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాటించడం వల్ల కూడా సులభంగా ఉపశమనం పొందుతారు.


మొటిమల సమస్యల బాధపడుతున్నవారు ప్రతి రోజు రోజ్ వాటర్‌ను చర్మంపై అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ  రోజ్ వాటర్‌లో ఉండే గుణాలు చర్మాన్ని మెరుగు పరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని బిగుతుగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. రోజ్ వాటర్ చర్మం సహజ pH స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. 


నారింజ తొక్క పొడితో రోజ్ వాటర్ మిశ్రమం:
నారింజ తొక్కను ఎండలో ఎండబెట్టి మెత్తగా పొడిలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పొడిలో తగినంత రోజ్‌ వాటర్‌ వేసుకుని మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొటిమల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. 


నిమ్మ, రోజ్ వాటర్:
నిమ్మకాయలో ఆమ్ల గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఈ నిమ్మ, రోజ్ వాటర్‌ను మిక్స్‌ చేసి ఫేస్‌కు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ రెండింటిని ముఖానికి అప్లై చేసి దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. పూర్తిగా ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


గంధపు పొడితో రోజ్ వాటర్ మిశ్రమం:
గంధపు పొడిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ పొడిలో రోజ్‌ కలుపుకుని మిశ్రమంలా తయారు చేసుకుని మొటిమల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే సులభంగా తగ్గుతాయి. 


ముల్తానీ మట్టితో రోజ్ వాటర్: 
ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ముఖానికి అప్లై చేస్తే మొటిమల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దీనిని చర్మ సమస్యలతో బాధపడేవారు కూడా వినియోగించంచవచ్చు. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter