Sleeping Tips: రాత్రి నిద్ర రావడం లేదా? అయితే ఇది తెలుసుకోవడం తప్పనిసరి
Milk For Sleeping : సరిగ్గా నిద్రపోకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు మొదలవుతాయి. అందుకే మంచిగా నిద్ర పట్టడం కోసం ఈ చక్కటి చిట్కా ఉపయోగపడుతుంది. ఈ విషయం తెలుసుకుంటే ఎంతో మంచి నిద్ర మీ సొంతం..
Sleeping Tips : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకు కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి.,అస్తవ్యస్తమైన అలవాట్ల కారణంగా ఎందరో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి నిద్ర అలవాటు ఉన్నవారికి ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సరిగ్గా నిద్ర లేకపోతే ఆ చిరాకు మనకు రోజంతా ఉంటుంది. ఇప్పటి జనరేషన్ కు నిద్ర సమస్యలు పెద్ద సవాలుగా మారాయి.
ఉద్యోగంలో ఉన్న స్ట్రెస్.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇటీవల కాలంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నాణ్యమైన నిద్ర ప్రతి ఒక్కరు కోరుకుంటారు…అయితే కొందరికి మాత్రం అది అందని ద్రాక్ష పండుగానే మిగులుతోంది. అలాగని నిద్రపోవడానికి నిద్ర మాత్రలు ఉపయోగించడం మంచి పద్ధతి కాదు. ఆందోళన, టెన్షన్, డిప్రెషన్ లాంటిది నిద్రలేమి సమస్య వల్ల ఎక్కువ అవుతాయి. మరి చక్కటి నిద్ర రావాలి అంటే ఇంటి వద్ద పాటించగలిగే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం..
పాలు:
పాలలో నిద్రను ప్రోత్సహించే ట్రిప్టోఫాన్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి పడుకోవడానికి ముందు గోరువెచ్చని పాలు తీసుకోవడం వల్ల చక్కటి నిద్ర వస్తుంది. మీకు ఉట్టి పాలు తాగడం ఇష్టం లేకపోతే పాలలో కాస్త పసుపు వేసి తీసుకోవచ్చు. పసుపు పాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జీర్ణ వ్యవస్థని బలోపేతం చేస్తాయి. పసుపులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ పలు రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.
అశ్వగంధ:
అశ్వగంధ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నిద్రించడానికి ముందు అశ్వగంధ తో చేసిన టీ ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. నిద్రలేమి సమస్యను దూరం చేయడంతో పాటు అనేక ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా అశ్వగంధ టీ చక్కటి పరిష్కారం.
చమోమిలే టీ:
చూడడానికి కాస్త చామంతి పువ్వులా ఉండే ఈ చమోమిలే పువ్వుతో తయారు చేసే టి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఈ టీ ఒత్తిడిని తగ్గించి స్ట్రెస్ ని కూడా దూరం చేస్తుంది. ఈ టీ కి సంబంధించిన టీ బ్యాగ్స్ మార్కెట్లో సులభంగా దొరుకుతాయి.
Also Read: KT Rama Rao: సమాజానికి పట్టిన చీడపురుగు తీన్మార్ మల్లన్న.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Also Read: U Tax Scam: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలనం.. రేవంత్ ప్రభుత్వంపై 'యూ ట్యాక్స్' పేరుతో మరో బాంబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter