Soft and Shiny Hair with Banana: అరటి పండ్లు అన్ని సీజన్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో విటమిన్స్ ,మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మలబద్ధక సమస్యకి తక్షణ రెమిడీ. అయితే దీన్ని బ్యూటీ రొటీన్ లో కూడా వాడుతారు. ఇది చర్మ ఆరోగ్యంతో పాటు జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మీకు మృదువైన మెరిసే జుట్టు మందంగా కావాలంటే అరటిపండుతో కొన్ని రకాల హెయిర్ మాస్కులు తయారు చేసుకోండి. ఇది మీ జుట్టుని మృదువుగా మెరిపిస్తూ ఫ్రీజీ హెయిర్ సమస్యకు నివారణగా పనిచేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరటిపండు గుడ్డు..
మూడు అరటిపళ్లను తీసుకొని దాన్ని మెత్తగా పిసకాలి. ఇప్పుడు ఇందులో ఒక గుడ్డు కూడా మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి ఒక 35 నిమిషాల అరగంట తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి అయితే ఏ హెయిర్ మాస్ వేసుకున్న హెయిర్ వాష్ మాత్రం సాధారణ నీటితోనే కడగాలి. వేడి నీళ్లు ఉపయోగించకూడదు ఇలా చేయడం వల్ల సత్వర ఫలితాలు లభిస్తాయి.


అరటిపండు కొబ్బరి నూనె..
అరటిపండు కొబ్బరి నూనె హెయిర్ మాస్క్‌ తయారు చేసుకోవడానికి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె ఒక అరటిపండు తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ పేస్టును జుట్టు అంతటికి పట్టించి ఒక గంట సేపు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూ వాడి చల్లనీళ్లతో తల స్నానం చేసుకోవాలి. దీంతో జుట్టు మెరుస్తూ, మృదువుగా అందంగా కనిపించడమే కాదు జుట్టు మందంగా పెరుగుతుంది కూడా. మంచి ఫలితాలు కూడా లభిస్తాయి.


ఇదీ చదవండి: ఈ మొక్కల ఆకులు పచ్చ రంగులోకి మారిపోతున్నాయా? ఈ చిట్కాతో చెక్ పెట్టండి


అరటిపండు కలబంద మాస్క్..
ఒక బౌల్ తీసుకొని అందులో రెండు అరటి పళ్ళను బాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కలబందను రెండు టీ స్పూన్లు తీసుకొని రెండు బాగా మిక్స్ చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు లూస్ బన్ వేసుకోవాలి. అయితే మీరు హెయిర్ వాష్ చేసుకున్న నెక్స్ట్ డే ఈ పని చేస్తే జుట్టు అందంగా కనిపిస్తుంది అరటిపండుతో హెయిర్ మాస్క్ వేసుకున్న ఒక అరగంట తర్వాత సాధారణ నీటితో షాంపూ పెట్టి తలస్నానం చేయాలి.


ఇదీ చదవండి: ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఈ 5 ఆహారాలు.. వెజిటేరియన్లకు ఎంతో మేలు..


అరటిపండు పెరుగు..
ఈ అరటిపండు పెరుగుతో మాస్క్ చేసుకోవడానికి మీరు 7 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి. దీంట్లో రెండు అరటిపళ్ళను వేసి బాగా మిక్స్ చేసి జుట్టు అంతటికీ పట్టించాలి. ఆ తర్వాత షవర్ కాప్ తొడిగించుకొని కాసేపు వదిలేసి ఒక గంట తర్వాత సాధారణ నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి