Soha Ali Khan Fitness Secret:  ఫిట్‌గా.. ఆరోగ్యంగా ఉండడానికి బాలీవుడ్ బ్యూటీ తీసుకుంటున్న ఆహారాలు తెలుసుకుందాం. సోహా అలీ ఖాన్ సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆమె లైఫ్ స్టైల్ రెగ్యులర్ ఎక్సైజ్ చేయడంలో ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యకరంగా ఉండటానికి కేవలం ఆ ప్రోటీన్స్ విటమిన్స్‌ పుష్కలంగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకుంటారు. ఆమె డైట్ ప్లాన్ వల్ల ఆమె బరువు అదుపులో ఉంటూ మంచి కాంతివంతమైన చర్మం సొంతం చేసుకున్నారు. సోహా అలీఖాన్ తన డైట్ లో చేర్చుకునే టాప్ 5 సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆహారాలు ఆమె బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటారంట ఇలా చేయడం వల్ల ఫిట్నెస్ గా ఆరోగ్యంగా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రీక్‌ యోగర్ట్‌.. 
గ్రీక్‌ యోగర్ట్‌ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకునే అలవాటు సోహా అలీ ఖాన్‌కు ఉందట. ఇది మనకు రోజంతటికి కావలసిన శక్తి అందిస్తుంది. ఎందుకంటే దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గ్రీక్ యోగర్ట్‌ ఆమె బాదంతో పాటు తీసుకుంటారంట. ఈ రెండిటి కాంబినేషన్ తో మనకు రోజంతటి కావాల్సిన శక్తి అందుతుంది. దీంతో రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. మన పేగు ఆరోగ్యం కూడా బాగుంటే మేటబాలిజం రేటు కూడా బూస్ట్ అవుతుంది.


పండ్లు, బాదం..
ఇక సోహా అలీ ఖాన్ తన రొటీన్ బ్రేక్ఫాస్ట్ సమయంలో పండ్లు, బాదంను కలిపి కూడా తీసుకుంటారు. పండ్లు అంటే ముఖ్యంగా బెర్రీ పండ్లు, అరటి పండ్లు, సీడ్స్‌ తో పాటు క్రంచి బాదంను తీసుకుంటారంట. ఈ మూడింటికి కలయికతో మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతాయి దీంతో జీర్ణక్రియ కూడా మెరుగ్గా మారుతుంది మన బిజీ డే లో మంచి శక్తిని అందిస్తుంది.


ఇదీ చదవండి: శతభిషా నక్షత్రంలోకి శని.. మరో 12 రోజుల్లో ఈ రాశికి బ్యాడ్‌న్యూస్‌, అడుగడుగునా గండాలే..!


ఓట్స్ నట్స్..
ఆమె డైలీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రూట్స్, నట్స్ కి ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఓట్స్ కూడా డైట్లో చేర్చుకుంటారు. నానబెట్టిన ఓట్స్ లో కట్ చేసిన నట్స్, సీడ్స్ వేసుకొని తీసుకుంటారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఈ రెసిపీ తీసుకోవడం వల్ల రోజంతటికి కావలసిన హైడ్రేషన్ కూడా తనకు అందుతుంది. దీంట్లో ఉండే పోషకాల వల్ల బూస్టింగ్ మన శరీరానికి ఇస్తుంది.


పోచ్డ్‌ ఎగ్స్..
సోహా అలీ ఖాన్ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకునే మరో సూపర్ ఫుడ్స్ పోచ్డ్‌ ఎగ్స్. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతేకాదు ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. రోజంతటికీ కావలసిన శక్తి అందుతుంది. ఎక్కువ సమయం పాటు నిండిన అనుభూతి కలుగుతుంది. అంతేకాదు పోచ్డ్‌ ఎగ్స్‌ తీసుకోవడం వల్ల మన శరీరానికి సమతుల ఆహారం అందినట్టు అవుతుంది.


ఇదీ చదవండి: రేపు 18న చంద్రగ్రహణం, పౌర్ణమి.. ఈ 3 రాశులకు జన్మలో చూడని అదృష్టం వర్తిస్తుంది..


క్వినోవా..
క్వినోవాలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిపై నుంచి కట్ చేసిన అరటి పండ్లు క్రంచి బాదం ముక్కలు క్రీమీ బట్టర్ వేసుకొని ఈ కాంబినేషన్లో సూపర్ ఫుడ్ తీసుకుంటారు. క్వినోవా ఇది కూడా ఎనర్జీ అందిస్తుంది. ఇందులో ఫైబర్ ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది మన డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.