Shani Gochar 2024: శతభిషా నక్షత్రంలోకి శని.. మరో 12 రోజుల్లో ఈ రాశికి బ్యాడ్‌న్యూస్‌, అడుగడుగునా గండాలే..!

Shani Gochar 2024: శనిదేవుడు అంటేనే భయం ఎందుకంటే ఈయన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శని దశ ఉంటే ఆ వ్యక్తికి అడుగడునా గండాలు, కష్టాలు. ఏ పని చేసినా కలిసి రాదు. అయితే, శని గోచారం వల్ల ఓ 5 రాశుకుల మరో 12 రోజుల్లో గండాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్‌ చేయండి..
 

1 /7

మేషరాశి.. శని దేవుడు రానున్న అక్టోబర్‌ 3 వ తేదీన నక్షత్రం మారనున్నాడు. పూర్వభాద్ర నక్షత్రం నుంచి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సందర్భంగా ఓ 5 రాశులకు బ్యాడ్‌ డేస్‌ స్టార్ట్‌. డిసెంబర్‌ 27వ తేదీ వరకు ఆ నక్షత్రంలోనే ఉంటాడు. ఈ సందర్భంగా మేష రాశివారు ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

2 /7

మిథున రాశి.. శనిదేవుని వల్ల మిథున రాశివారికి కూడా కష్టాలు తప్పవు. ఈ సమయంలో ఈ రాశివారికి మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో మిథున రాశివారు ఖర్చులను తగ్గించుకోండి.

3 /7

సింహరాశి.. సింహరాశి అధిపతి సూర్యుడు శనిదేవుని తండ్రి అయితే, ఈ సమయంలో సింహరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు పెరగవచ్చు. కెరీర్‌లో ఆచితూచి అడుగువేయాలి. ముఖ్యంగా శనిదేవుని వల్ల ఆందోళనలు పెరుగుతాయి. సింహరాశివారు కూడా ఏ తప్పు చేయకూడదు.

4 /7

తులరాశి.. సాధారణంగా తుల రాశి అంటే శనిదేవుడికి ఇష్టం. కానీ, ఈసమయంలో వీరు ఏతప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఇతరులకు మోసం చేయకుండా ఉండాలి. ఎందుకంటే శని కర్మలను బట్టి ఫలాలను అందిస్తాడు.

5 /7

కుంభరాశి.. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. అయితే, ఆచితూచి అడుగువేయాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆర్థికంగా లాభం పొందుతారు.

6 /7

మీనరాశి.. మీన రాశివారు పేదవారికి సహాయం చేయండి. పురోగతికి అడ్డుపడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. శనివల్ల ఈ రాశివారు అద్భుతాలు చూస్తారు. కానీ,చదువు, రాజకీయ రంగంలో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి.

7 /7

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)