Spearmint for Cough And Cold in Winter Season: మార్కెట్లో సులభంగా లభించే ఆకుకూరల్లో పుదీనా ఆకులు ఒకటి. ఇది అన్ని వాతావరణంలోను సులభంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఏ కాలంలో నైనా మనకు సులభంగా లభిస్తాయి. వీటిని ఎక్కువగా నాన్ వెజ్ వండుకునే క్రమంలో వినియోగిస్తారు. చాలామంది ఆహారంలో వేసిన పుదీనాను తినే క్రమంలో తీసి పక్కన పడేస్తూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తినడం శరీరానికి చాలా మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆకులను గ్రైండ్ చేసి రైస్ వండుకునే క్రమంలో ఆ పేస్టును అందులో వినియోగించి పుదీనా రైస్ లా కూడా చేసుకోవచ్చు. ఇలా తయారుచేసిన రైస్ ను తప్పకుండా తింటే బాడీకి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పుదీనా ఆకులను టీ లాగా చేసుకుని తాగితే తీవ్ర వ్యాధులనుంచి శరీరాన్ని రక్షిస్తుంది.


పుదీనా టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా సీజనల్ లో వచ్చే వ్యాధులన్నీ సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మారుతుంది. వాతావరణ మార్పుల కారణంగా చాలామంది పొట్ట సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపవాసం పొందడానికి ఈ ఆకులతో చేసిన టీనే ప్రతిరోజు రెండుసార్లు తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఉండే గుణాలు శ్వాసకోస సమస్యలు దగ్గు, జలుబు, ఆస్తమాతో పాటు దంతాల సమస్యలను కూడా దూరం చేసేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ టీ ప్రభావంతో పనిచేస్తుంది.


ఈ టీ ని తయారు చేసుకునే విధానం:
ఈటీవీ తయారు చేసుకోవడానికి ముందుగా ఐదు పుదీనా ఆకులను కడిగి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఓ బౌల్లో రెండు కప్పుల నీటిని వేసి మరుగనివ్వాలి. ఇలా మరుగుతున్న క్రమంలో అందులో పుదీనా ఆకులను వేసి.. ఐదు నిమిషాల పాటు మరిగించాలి ఆ తర్వాత రుచికి కావాల్సినంత తేనెను వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన టీ ని ప్రతిరోజు రెండు సార్లు తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


Also Read : Boss Party Song Promo : వాల్తేరు వీరయ్య.. ఇదేం పాట అయ్యా.. దేవీ శ్రీ ప్రసాద్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు


Also Read : Adireddy Wife Kavitha : బిగ్ బాస్ ఇంట్లో ఆదిరెడ్డి ఫ్యామిలీ.. ఫుల్ పాజిటివ్ ఇమేజ్.. రేవంత్ కన్నీరుమున్నీరు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook