ఆన్ లైన్ షాపర్లకు శుభవార్త. ఆన్ లైన్ షాపింగ్ వేదికలైన ఫ్లిప్ కార్ట్ ( Flipkart ), అమెజాన్ ( Amazon ) లలో ఆఫర్ల సేల్ ప్రారంభమవుతోంది. రేపట్నించి అనగా అక్టోబర్ 17 నుంచి ఫెస్టివల్ ఆఫర్స్ ప్రారంభం కానున్నాయి. వివిధ ప్రొడక్టులపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజమైన అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ( Great Indian festival ) ఆఫర్ రేపట్నించి ప్రారంభం కానుంది. అక్టోబర్ 17 నుంచి ఈ ఫెస్టివల్ ఆఫర్ ప్రారంభం కానున్నా...అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం రేపు మధ్యాహ్నం నుంచి అందుబాటులో రానుంది. ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ( Big Billion Days sale ) ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ సభ్యులకు ప్రారంభం కాగా...మిగిలినవారికి రేపు ప్రారంభం కానుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 16 నుంచి 21 వరకు ఉంటుందని ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. అమెజాన్ మాత్రం ఎప్పటివరకుంటుందనేది ఇంకా ప్రకటించలేదు.


అమెజాన్ ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు సహాయంతో షాపింగ్ చేసినవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.  ఇక బజాజ్ ఫిన్‌సర్వ్ ( Bajaj Finserv ) కస్టమర్లు లక్ష రూపాయల వరకూ క్రెడిట్ లిమిట్ పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా వర్తిస్తుంది. అమెజాన్ పే యూజర్లైతే రోజుకు 5 వందల వరకు రివార్డు పాయింట్లు పొందవచ్చు.


అమెజాన్ ఉత్పత్తి ( Amazon products ) అయిన ఫైర్ టీవీ స్టిక్ లైట్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌‌లో లభ్యమవుతోంది. లేటెస్ట్‌గా ఇవాళ  లాంఛ్ అయిన వన్‌ప్లస్ 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా అమెజాన్ సేల్‌లో లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్స్‌పై 30 వేల వరకూ, హెడ్‌ఫోన్స్‌పై 70 శాతం , స్మార్ట్ వాచ్‌లపై 70 శాతం , కెమెరా డివైస్ లపై 60 శాతం తగ్గింపు ఉంది. అమెజాన్ సొంత ఉత్పత్తులైన ఇకో స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ డిస్‌ప్లేలపై భారీ తగ్గింపు అందిస్తోంది.


మొబైల్ యాప్‌ ద్వారా షాపింగ్ చేసేవారికి ప్రతీ రోజు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గోల్డెన్ అవర్ డీల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్స్, రిఫ్రిజిరేటర్, ఫర్నీచర్, ఫ్యాషన్ వేర్‌పై భారీ రాయితీ అందుబాటులో ఉంటుంది.  అటు ఫ్లిప్ కార్ట్ లో ఇప్పటికే ప్రారంభమైన బిగ్ బిలియన్ డేస్ లో భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై మంచి ఆపర్లు అందుబాటులో ఉన్నాయి. Also read: Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది