పండగ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీపావళి ( Diwali ), దసరా పండుగలకు మనం మన ఇంటిని ఇప్పటి నుంచే ముస్తాబు చేయడం ప్రారంభిస్తాము. అందులో భాగంగా ఇంటికి రంగు వేయడం చేస్తుంటాం. ఇంటికి తెల్ల రంగు మాత్రమే వేయడం అనేది చాలా మంది చేసేపని. అయితే వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేసేవారు.. ఇంటి రంగు విషయంలో మాత్రం ఎక్కువగా ఆలోచించరు. కొన్ని రంగులు కొన్ని గోడలకు మంచి ఆకర్షణ తీసుకురావడమే కాదు.. మంచి లక్కును కూడా తీసుకొస్తాయి. ఆరోగ్యాన్ని ( Health ) కలిగిస్తాయి.
ALSO READ: Wallet for Wealth: పర్సులో ఏం ఉంచాలి ? ఏ రంగు వ్యాలెట్ వల్ల సంపద కలుగుతుంది..
మీరు మీ జీవితంలో ఆరోగ్యం, సంపద రావాలంటే ఇలా చేసి చూడండి
1 ) ప్రధాన ద్వారానికి లైట్ కలర్స్ వాడటం మంచిది. ఏ రంగు అయినా ఎంపిక చేసుకోండి. కానీ అందులో నలుపు రంగు లేదా తెలుపు, లేదా ఎరుపు రంగు మాత్రం ఉండకుండా చూసుకోండి.
2 ) ఇంట్లో పూజ గదికి లేత పసుపు లేదా తెలుపు రంగు వేయడం మంచిది. ధ్యానం చేసే సమయంలో ఈ రంగులు మీకు ఉపయోగపడతాయి.
3) డ్రాయింగ్ రూమ్ రంగుల విషయంలో దిగులు పడుతుంటే తెలుపు, లేదా లైట్ బ్లూ, లైట్ గ్రీన్, లైట్ పింక్ కలర్స్ ఎంచుకోండి.
4) కిచెన్ కోసం తెల్ల రంగు లేదా ఏదైనా లైట్ రంగులు ఎంచుకోండి. లేత నారింజ రంగు కూడా మంచిదే..కానీ ఎరుపు రంగు మాత్రం వాడకండి.
ALSO Read | Aadhaar PVC Card: పర్సులో పట్టే హైటెక్ ఆధార్ కార్డు
5) లివింగ్ రూమ్ కోసం తెలుపు లేదా క్రీమ్ కలర్ వాడితే మంచిది.
6) పిల్లల స్టడీ రూమ్ కోసం క్రీమ్ కలర్, పసుపు పచ్చ, లేదా లేత గులాబీ రంగును వాడండి. ఈ రంగులు చదువుపై ఫోకస్ పెట్టేలా చేస్తాయి.
7) మాస్టర్ బెడ్ రూమ్ విషయానికి వస్తే నీలం రంగు ఇష్టం ఉన్నవాళ్లు ట్రై చేయవచ్చు. ఇతర బెడ్ రూమ్స్ కోసం పసుపు రంగు, మెరూన్ కలర్స్ వాడవచ్చు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR