Stop Hair Fall Immediately: ఆధునిక జీవనశైలి కారణంగా జుట్టు రాలడం సాధరణ సమస్యగా మారింది. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. దీని కోసం ప్రస్తుతం చాలా మంది అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన నూనెలను వినియోగిస్తున్నారు. దీంతో పాటు కొన్ని సీరమ్‌లకు కూడా వినియోగిస్తున్నారు. వీటన్నింటిని వినియోగించినప్పటికీ జుట్టు రాలడం ఆగడం లేదు. అయితే జుట్టు రాలడం తగ్గాలంటే తప్పకుండా శరీరానికి తగిన పోషకాలు కూడా చాలా అవసరం. బాడీకి తగిన పోషకాలు లభిస్తే జుట్టు రాలడం ఆగుతుంది. అంతేకాకుండా జుట్టు కూడా ఆరోగ్యం ఉంటుంది. అయితే ప్రతి రోజు డైటీషియన్స్‌ సూచించిన కొన్ని ఆహారాలు ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే జుట్టు సమస్యలతో బాధపడేవారు ఎలాంటి ఆహారాలు, డ్రింక్స్‌ ప్రతి రోజు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెయిర్ స్ట్రెంగ్థనింగ్ డ్రింక్:
బయోటిన్ రిచ్ డ్రింక్‌ ప్రతి రోజు తాగడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు కరివేపాకు రసం, ఉసిరి రసం తాగడం వల్ల సులభంగా జుట్టు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమస్యలతో బాధపడేవారు  బాదం, వాల్‌నట్, గుమ్మడి గింజలను కూడా ప్రతి రోజు తీసుకోవచ్చు. 


జుట్టుకు బాదం వల్ల కలిగే ప్రయోజనాలు:
బాదంలో విటమిన్ ఇ, బయోటిన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల జుట్టు బలోపేతం అవుతుంది. అంతేకాకుండా జుట్టు కూడా రీపేర్‌ అవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జుట్టు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి బాదం పప్పును ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.


వాల్ నట్స్:
వాల్ నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్  అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల జుట్టు చాలా దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా తగ్గిస్తుంది. కాబట్టి తీవ్ర జుట్టు సమస్యలతో బాధపడేవారు వాల్‌నట్‌లను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


గుమ్మడి గింజలు:
గుమ్మడి గింజల్లో జింక్ బోలెడంత లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఇవి జుట్టు రంగును మార్చేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


కరివేపాకు:
కరివేపాకులో ఉండే గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జుట్టు రంధ్రాలను బలంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి