Constipation remedies : మలబద్ధకం అనేది ఈమధ్య చాలామంది ఎదుర్కొంటున్న కామన్ సమస్య. ముఖ్యంగా ఈ వేసవిలో అది ఇంకా ఎక్కువ అవుతుంది. మనం తాగే నీటి శాతం సగం ఎండల వల్లే ఆవిరి అయిపోవడం వల్ల.. మన బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఆ సమయంలో చర్మం పొడిబారిపోవడం, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలు వచ్చి పడతాయి. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా మంచినీళ్లు తాగుతూ ఉండాలి. మంచినీళ్లే కాకుండా ఇతర పానీయాలు తాగడం వల్ల కూడా.. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవికాలంలో మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు.. మలబద్దకానికి మంచి ఔషధాలుగా పని చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెల్లం జ్యూస్
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో.. స్పూన్ బెల్లంని కరిగించి తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. బెల్లం లో ఉండే ఐరన్, మెగ్నీషియం వంటివి మలబద్ధకాన్ని నియంత్రించడంలో బాగా ఉపయోగపడతాయి. 


లెమన్ జ్యూస్


ఇక ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో.. నిమ్మరసం పిండుకొని తాగితే చాలావరకు జీర్ణ సమస్యలు తీరిపోతాయి. మన ఒంట్లో ఉన్న టాక్సిన్స్ ని బయటకు విడుదల చేయడానికి నిమ్మరసం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నచ్చిన వాళ్ళు అందులో కొంచెం తేనె కూడా కలుపుకొని తాగొచ్చు. రోజు ఇలా తాగడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి. 


ఆపిల్ జ్యూస్


రోజుకి ఒక ఆపిల్ తింటే డాక్టర్ జోలికి వెళ్లాల్సిన అవసరమే రాదు అంటారు. అందులో ఉంటే ఫైబర్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మలబద్ధకం ఉన్నప్పుడు కూడా ఆపిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఆపిల్ లో ఉండే పీచు పదార్థం మలబద్ధకం తగ్గిపోయేలా చేస్తుంది. ఆపిల్ జ్యూస్ లో ఉండే నీటి శాతం వల్ల కూడా.. మలబద్ధకం మన దరిచేరదు.


బేకింగ్ సోడా


ఇక బేకింగ్ సోడా వల్ల కూడా గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు గ్లాస్ నీటిలో బేకింగ్ సోడా కలుపుకొని తాగితే, ఉదయం లేచేసరికి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. కడుపు ఉబ్బరం గా అనిపించినప్పుడు కూడా.. బేకింగ్ సోడా మంచి ఔషధంగా పనిచేస్తుంది.


ఆముదం


ఆముదం లో జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలు ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఒక టీ స్పూన్ ఆముదం తాగడం వల్ల.. మలబద్ధకం నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు స్పూన్ ఆముదం తాగినా మంచి ఫలితం ఉంటుంది.


త్రిఫల చూర్ణం


ఆయుర్వేదంలో మందులేని రోగం ఉండదు అంటారు. అలాగే మలబద్ధకానికి కూడా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ ఉంది. అదే త్రిఫల చూర్ణం. ఉదయం లేవగానే రెండు టీ స్పూన్ల త్రిఫల చూర్ణాన్ని.. ఒక గ్లాసు నీటిలో కలిపి తాగితే మలబద్ధకం తగ్గిపోతుంది.


Also Read: YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్‌ జగన్‌


Also Read: Pithapuram: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter