YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్‌ జగన్‌

YSRCP Election Manifesto 2024 Here Full Details In Telugu: ఐదేళ్లు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ పాలించిన వైఎస్సార్‌సీపీ రెండోసారి అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకుని పాలిస్తామని తన మేనిఫెస్టోతో తెలిపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 27, 2024, 12:10 PM IST
YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్‌ జగన్‌

YSRCP Manifesto: మరోసారి అధికారం సొంతం చేసుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు భారీగా హామీల వర్షం కురిపించింది. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరికొన్నింటిని ప్రకటించింది. పాత కొత్త కలయికతో ఏపీ ప్రజలకు భారీగా హామీలు ఇచ్చింది. మరోసారి ముఖ్యమంత్రి పదవి పొందాలనే ఆకాంక్షతో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మేనిఫెస్టో రూపకల్పనలో కీలక ప్రతిపాదనలు చేశారు. భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా వైఎస్‌ జగన్‌ భావిస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టోను అత్యంత జాగ్రత్తతో రూపొందించారు.

Also Read: Pithapuram: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడా

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. 'మేనిఫెస్టోను పవిత్రంగా భావించే వ్యక్తిని నేను. 2019 ఎన్నికల సమయంలో నవరత్నాల పేరిట ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతానికి పైగా అమలు చేశాం. డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2.68 లక్షల కోట్లు జమ చేశాం' అని సీఎం జగన్‌ తెలిపారు. మేనిఫెస్టోను మొత్తం అమలుచేసినందుకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. పథకాలన్నీ ప్రజలకు అందించి హీరోగా ప్రజల ముందుకు వెళ్తున్నానని ప్రకటించారు.

Also Read: YS Sunitha: జగన్‌ అన్నయ్య ఇక చాలు.. తలకు బ్యాండేజ్‌ తీసేయ్‌: వైఎస్ సునీత

ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షన పథకాలను సీఎం జగన్ ప్రకటిస్తారని సమాచారం. మహిళలు, రైతులు, యువతకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలను ఆకట్టుకున్న అన్ని పథకాలను కూడా మేనిఫెస్టోలో ఉంచారు. నవరత్నాలను అప్ గ్రేడ్ చేశారు. మొదటి పర్యాయం సంక్షేమంపై దృష్టి సారించగా.. రెండో పర్యాయంలో అభివృద్ధిపై దృష్టి సారించేలా మేనిఫెస్టో రూపొందించారు. పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పనపై మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News