Health Benefits Of Kharbuja: సాధారణంగా కొన్ని పండ్లు, కూరగాయలు ఏడాది పొడవునా లభించవు. ఇవి ఏ సీజన్ లో లభిస్తే అప్పుడే తినాలి. ముఖ్యంగా మామిడి, పుచ్చకాయ, సీతాఫలం వంటి పండ్లు వేసవిలో మాత్రమే దొరుకుతాయి. ఎండాకాలంలో మీరు ఎక్కువ డీహైడ్రేషన్  కు గురవుతారు. శరీరంలో నీటి కొరతను అధిగమించడానికి పుచ్చకాయ మంచి ఆప్షన్. ఈ పుచ్చకాయ జాతికి చెందినదే కర్బూజ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కర్బూజ పండులో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ ఉంటుంది. కర్భూజ శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని వేడిని తగ్గించడంలో  అద్భుతంగా సహాయపడుతుంది. ఈ ఫ్రూట్ లో తియ్యదనం ఎక్కువగా ఉంటుంది.  ఇది ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తుంది. కర్భూజతో బెనిపిట్స్ ఏంటో తెలుసుకుందాం. 


1. మధుమేహం
కర్బూజ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరమనే చెప్పాలి. శరీరంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్  చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. 
2. రోగనిరోధక శక్తి
పుచ్చకాయలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఇమ్యూనిటీ అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
3. కళ్ళు
కర్బూజలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ అధిక మెుత్తంలో లభిస్తుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 
4. జీర్ణక్రియ
వేసవి కాలంలో జీర్ణక్రియ సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది. కర్బూజ  తీసుకోవడం వల్ల మీరు ఉదర సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Weight Loss: అధిక బరువు సమస్యగా ఉందా, ఇవాళే ఈ 5 పదార్ధాలు దూరంగా ఉండండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook