Weight Loss: అధిక బరువు సమస్యగా ఉందా, ఇవాళే ఈ 5 పదార్ధాలు దూరంగా ఉండండి

ఇటీవలి కాలంలో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలో బరువు తగ్గించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతున్నారు. కొంతమంది వ్యాయామం చేస్తుంటే మరికొందరు డైట్ తగ్గించడం చేస్తున్నారు. అయితే కొన్ని సూచనలు పాటిస్తూ కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరంగా ఉంటే బరువు తగ్గించడం పెద్ద సమస్యే కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Weight Loss: ఇటీవలి కాలంలో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలో బరువు తగ్గించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతున్నారు. కొంతమంది వ్యాయామం చేస్తుంటే మరికొందరు డైట్ తగ్గించడం చేస్తున్నారు. అయితే కొన్ని సూచనలు పాటిస్తూ కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరంగా ఉంటే బరువు తగ్గించడం పెద్ద సమస్యే కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు..
 

1 /5

వైట్ రైస్ బరువు తగ్గించాలంటే వైట్ రైస్ సాధ్యమైనంతవరకూ తగ్గించేయాలి. రోజూ అదే పనిగా అన్నం తింటుంటే బరువు విపరీతంగా పెరుగుతారు. 

2 /5

వైట్ బ్రెడ్ చాలామందికి బ్రేక్ ఫాస్ట్‌లో వైట్ బ్రెడ్ తినడం అలవాటు. ఇష్టంగా తింటుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదు. అధిక బరువు సమస్యకు ఇదే ప్రధాన కారణం. స్థూలకాయాన్ని మరింత పెంచుతుంది. 

3 /5

ఆయిలీ ఫుడ్స్ మీరు నిజంగా బరువు తగ్గించుకోవాలనుకుంటే..ఇవాళ్టి నుంచే ఆయిలీ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి. ముఖ్యంగా కచౌరీ, సమోసా, పూరీ వంటి పదార్ధాలు మానేయాలి.

4 /5

పాల ఉత్పత్తులు బరువు తగ్గించుకోవాలనుకుంటే తక్షణం పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, పన్నీర్, ఛీజ్ వంటివి తగిన మోతాదులోనే తీసుకోవాలి.

5 /5

ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం లేనివారుండరు. దాదాపు అందరూ ఇష్టపడతారు. కొంతమందైతే రాత్రి నిద్రించే ముందు తప్పనిసరిగా ఐస్ క్రీమ్ తీసుకుంటారు. ఈ అలవాటు మానుకోకపోతే స్థూలకాయం నియంత్రణ సాధ్యం కాదు.